మెగాస్టార్ చిరంజీవి కరోనా సమయంలో సినీ రంగ కార్మికులను ఆదుకున్న దేవుడు అని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కొనియాడారు. హైదరాబాద్ యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలుగు చలన చిత్ర కార్మిక మహోత్సవం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి మంత్రి మల్లారెడ్డి ఇచ్చిన మాస్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదీ చదవండి: హీరో సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు.. ‘పాన్ ఇండియా అనేది ఒక నాన్సెన్స్’
మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ‘అన్న నేను నీకు పెద్ద అభిమానిని. నేను నీ అంత ఫేమస్ అయితే కాదన్నా. నువ్వు కేంద్ర మంత్రిగా చేశావ్. నీ కుటుంబం మొత్తం పెద్ద పెద్ద యాక్టర్లున్నారు. కరోనా కష్టకాలంలో సినీ కార్మికుల కోసం నిలబడింది నువ్వొక్కడివే అన్నా. కరోనా సమయంలో కోట్లు ఖర్చుపెట్టి సినీ కార్మికులను ఆదుకున్న దేవుడు అన్నా నువ్వు. నువ్వు ఇలాగే సినీ కార్మికుల అభివృద్ధి కోసం కృషి చేయాలి. సీఎం కేసీఆర్, కేటీఆర్ సినిమా రంగం అభివృద్ధి చెందేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. ఇంకా ఎన్నో ఓటీటీ సినిమాలు రావాలి. మీరు కూడా ఓటీటీ సినిమాలను ఎంకరేజ్ చేయాలి. ఓటీటీ సినిమాల్లో కార్మికులను భాగస్వాములను చేయాలి. వారికి కూడా షేర్లు ఇయ్యాలే. వారిని అభివృద్ధి చేసేందుకు నువ్వు కూడా కంకణం కట్టుకోవాలే.’‘నేను కూడా స్టూడియో కడతాను.. త్వరలోనే ఓటీటీ సినిమాలు తీస్తాను. నీ దగ్గర మస్త్ పైసలున్నాయ్, నా దగ్గరా మస్త్ పైసలున్నాయ్. మనకు డబ్బు అవసరం లేదన్నా. మనం సినీ కార్మికుల కోసం కృషి చేద్దాం. త్వరలో ఈ విషయంపై నిన్ను కలుస్తాను’ అంటూ మంత్రి మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా చిరంజీవి ఆంధ్రోడు కాదని.. తెలంగాణ బిడ్డ అని మంత్రి వ్యాఖ్యానించారు. ఇక్కడున్న సినీ కార్ముకులంతా తెలంగాణ బిడ్డలేనని మల్లారెడ్డి తెలిపారు. చిరంజీవితో సినిమా చేయాలనుందని మల్లారెడ్డి కోరారు. కష్టపడి పనిచేస్తే ఎవరైనా ఉన్నత శిఖరాలు అధిరోహించగలరని చెప్పేందుకు మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తుల జీవితాలే ఉదాహరణలు అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. చివర్లో మల్లారెడ్డి ఆయనదైన స్టైల్ లో చిరంజీవిని స్టేజ్ పైకి పిలిచి అన్నా ఇట్లా ఒస్తే ఒక ఫొటో తీయుంచుకుని బయల్దేరతానన్నా అని అడిగిన తీరు నవ్వులు పూయించింది. చిరంజీవిపై మంత్రి మల్లారెడ్డి కురిపించిన ప్రశంసలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.