హైదరాబాద్ వాసులకు శుభవార్త.
దేశంలోనే తొలి పూర్తిస్థాయి వైఫై నగరం – హైదరాబాద్!!.
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరికి ఇంటర్నెట్ అనేది చాలా ముఖ్యం. అది లేకపోతే ఆండ్రాయిడ్ మొబైల్ ఉండటం కూడా వేస్టే. అయితే వాటిపై దృష్టి సారించిన ప్రభుత్వం హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త చెప్పింది. నగరంలో ఏ మూలకు వెళ్లిన ఇంటర్నెట్ సదుపాయం కల్పించే విధంగా చర్యలు తీసుకుంది. నగరం అంత వైఫై హాట్ స్పాట్స్ ఏర్పాటు చేయనున్నారు. నగరం నలుమూలలా జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేశారు.
ఆగష్టు 4వ తేదిన రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు ఈ హాట్‌స్పాట్ సెంటర్లను ప్రారంభించనున్నారు. ఇందులో ముఖ్యంగా ఏదైనా నగరంలో మూలన ఉండేటువంటి ప్రాంతాల నుంచి ఎక్కువగా ఈ సర్వీసులు వస్తే చాలా సౌకర్యంగా ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తోందట. అత్యవసర సమయాలలో ఈ వైఫై చాలా ఉపయోగపడుతుందని, అందుకోసమే వీటిని అందుబాటులోకి తెచ్చామని చెప్పుకొచ్చింది తెలంగాణా ప్రభుత్వం.
ఇందులో ప్రభుత్వం తో పాటు ACT అనే ఒక సంస్థతో చేతులు కలిపి , ఈ సేవలను నగరవాసులకు అందించడం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల దేశంలోని ఎటువంటివి జరిగినా తెలుసుకోవచ్చు. అంతేకాదు ఈ వైఫై వల్ల విద్యార్థులకు కూడా మంచి ప్రయోజనం చేకూరుతుందని చెప్పొచ్చు.