తెలంగాణలో మొన్నటి వరకు ఎండలు మండిపోయాయి.. ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపైకి రావాలంటేనే భయంతో వణికిపోయారు. ప్రస్తుతం వాతావరణం చల్లబడింది. తెలంగాణకు రుతుపవనాలు తాకాయి. దీంతో వర్షాలు పడటం మొదలయ్యాయి.
తెలంగాణ వ్యాప్తంగా మొన్నటి వరకు ఎండలు మండిపోయాయి. ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. వాస్తవానికి జూన్ మొదటి వారంలో వర్షాలు పడతాయని అందరూ భావించినప్పటికీ ఈ నెలలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపించాడు. మూడు రోజుల క్రితం తెలంగాణను రుతుపవనాలు తాకాయి. శనివారం హైదరాబాద్‌లో మధ్యాహ్నం వరకు ఎండలు మండాయి.. సాయంత్రం అకస్మాత్తుగా చల్లబడి భారీ వర్షం కురిసింది.
హైదరాబాద్ లో శనివారం రాత్రి వర్షం మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో భారీగా పడుతున్నట్టు సమాచారం అందుతోంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో లింగంపల్లి, పటాన్ చెరు, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్,కూకట్ పల్లి, కోఠి, సికింద్రాబాద్, బేగంపేట, ఉప్పల్, ఎల్బీ నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. వర్షం కారణంగా కొన్నిచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యియి. రోడ్లపై భారీగా వర్షపు నీరు పారుతోంది.. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొన్నిచోట్ల బస్టాపుల్లోకి నీళ్లు రావడంతో ఆర్టీసీ ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
భారీగా వర్షం పడటంతో హైదరాబాద్ విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తంగా ఉంది. మరోవైపు వర్షానికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు మెస్సేజ్ ద్వారా అలర్ట్ చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు గమనిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి రావొద్దని.. ట్రాన్స్ ఫార్మర్లు, కరెంటు స్థంబాల వద్ద ఎర్తింగ్ వచ్చే అవకాశం ఉంటుందని.. అలాంటి ప్రదేశాలకు వెల్లవద్దని హెచ్చరిస్తున్నారు అధికారు. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కునేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని అదేశాలు జారీ చేశారు.
#24JUNE 9:50PM⚠️
Widespread Moderate Rains covered Entire #Hyderabad city & No Stopping in Rains for Next 3Hrs🌧️#HyderabadRains pic.twitter.com/RKG9WI6nbt
— Hyderabad Rains (@Hyderabadrains) June 24, 2023