విద్యార్థులకు పరీక్షా సమయం ఎంత కష్టంగా ఉంటుంతో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కొన్నిసార్లు పరీక్షలు రాసే సమయానికి ఏదో ఒక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఐనవారిని కోల్పోయినా కొంత మంది ఎగ్జామ్స్ కి హాజరై ఆ బాధతోనే పరీక్షలు పూర్తి చేస్తుంటారు. తాజాగా రోడ్డు ప్రమాదంలో గాయపడి, మంచంపై నుంచి లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ పట్టుదలతో ఎగ్జామ్ రాయాలని భావించాడు. ఈ క్రమంలో వైద్యుల సహాయంతో అంబులెన్స్‌లోనే పరీక్ష రాసి ఓ విద్యార్థి అందరితో శభాష్ అనిపించుకున్నాడు. తాను ఎంత బాధపడుతున్నా పరీక్షలే ముఖ్యం అని భావించాడు ఆ విద్యార్థి. వివరాల్లోకి వెళితే..
సూర్యాపేట జిల్లా కు చెందిన గౌతమ్ కి ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ క్రమంలోనే అతనికి కాలుకు తీవ్ర గాయం కావడంతో ఆపరేషన్ చేశారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం గౌతమ్ కి పరీక్షలు.. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ తాను ఎలాగైనా పరీక్షలు రాయాలని సంకల్పించాడు. అతను అంబులెన్స్ లో నుంచి కదల లేని స్థితిలో ఉన్నాడని పరీక్ష నిర్వహకులకు తెలియజేయడంతో వారు కొన్ని కండీషన్లపై అంబులెన్స్ లోనే పరీక్ష రాయించారు.
పరీక్షలు రాయాలి.. పాస్ కావాలనే సంకల్పం గౌతమ్ కి ఎంతో ఉంది.. అతని సంకల్పానికి తాము అండగా నిలబడ్డామని వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు అన్నారు. ఆ మద్య ఓ విద్యార్థి తన కాలుకు గాయం అయితే స్టెచర్ పై వచ్చి ఇంటర్ పరీక్షలు రాశాడు. ఏది ఏమైనా చదువుకోవాలన్న పట్టుదల, తపన ఉంటే ఏదీ అసాద్యంకాదని ఈ ఘటన తెలియజేస్తుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.