ఈ యువతి పేరు శోభ. వయసు 18 ఏళ్లు. ప్రస్తుతం డిగ్రీ సెకండియర్ చదువుతోంది. అయితే, త్వరలో పరీక్షలు ఉండడంతో ఇంట్లో చదువుకుంటూ ఉండేది. కాగా, ఇటీవల ఓ రోజు రాత్రి ఈ యువతి బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
శోభ ప్రస్తుతం డిగ్రీ సెకండియర్ చదువుతుంది. ఇక చదువుకుంటూనే స్థానికంగా రిసెప్షనిస్ట్ గా ఉద్యోగానికి కుదిరింది. అలా చాలా రోజుల నుంచి అక్కడే ఉద్యోగం చేసింది. అయితే, త్వరలో పరీక్షలు ఉండడంతో ఇంటికి వెళ్లి చదువుకుంటుంది. అయితే, ఇటీవల ఓ రోజు రాత్రి శోభ బయటకు వెళ్లింది. ఆ తర్వాత జరిగింది తెలుసుకుని ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇది కలనా, నిజమా అనేది తెలుసుకోలేకపోతున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని సుందర్ నగర్ లో దుండగుల శోభ (18) అనే యువతి నివాసం ఉంటుంది. ప్రస్తుతం ఈమె డిగ్రీ సెకండియర్ చదువుతోంది. ఒక పక్క చదువుకుంటూనే మరొపక్క పట్టణంలోని ఓ ఆస్పత్రిలో రిసెప్షనిస్ట్ గా ఉద్యోగంలో చేరింది. శోభ ఇక్కడే కొన్ని రోజుల నుంచి పని చేస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే, త్వరలో డిగ్రీ పరీక్షలు ఉండడంతో శోభ ఇంటి వద్దే ఉండి చదువుకుంది. అయితే, శనివారం రాత్రి 7 గంటల సమయంలో శోభ మొబైల్ ఫోన్ ఇంట్లోనే ఉంచి బయటకు వెళ్లింది. నడుచుకుంటూ పక్కనే ఉన్న ఓ అపార్ట్ మెంటులోకి వెళ్లింది. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అక్కడికి వెళ్లాక ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, అపార్ట్ మెంట్ సెకండ్ ఫ్లోర్ నుంచి కిందపడి శోభ చనిపోయింది.
ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకు శోభ అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా పై నుంచి తోసేశారా? అసలు ఏం జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఉన్నట్టుండి కూతురు చనిపోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.