ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అందరికి గుర్తుకు వచ్చేది అంబులెన్స్. ఎవరైన ప్రాణపాయ స్థితిలో ఉన్నప్పుడు అంబులెన్స్ వచ్చి.. వారికి ఆస్పత్రులకు తీసుకెళ్తుంది. ఈ అబులెన్స్ పై రాసి ఉండే ఇంగ్లీష్ అక్షరాలు తిరగరాసి ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటాయో మీరెప్పుడైనా గమనించారా?
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అందరికి గుర్తుకు వచ్చేది అంబులెన్స్. ఎవరైన ప్రాణపాయ స్థితిలో ఉన్నప్పుడు అంబులెన్స్ వచ్చి.. వారిని ఆస్పత్రులకు తీసుకెళ్తుంది. ఈ అబులెన్స్ పై రాసి ఉండే ఇంగ్లీష్ అక్షరాలు తిరగరాసి ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటాయో మీరెప్పుడైనా గమనించారా..? అందుకు ఓ బలమైన కారణం ఉందంట. మరి అంబులెన్స్‌పై అక్షరాలు ఎందుకు తిరగరాసి ఉంటాయో తెలుసుకుందాం.
ప్రాణపాయ స్థితిలో ఉన్న రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ను వినియోగిస్తారు. ఈ వాహనం ద్వారా వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడుతుంటారు. ఈ వాహనానికి ట్రాఫిక్ అవాంతరాలు ఏర్పడకుండా రోడ్డు మీద అందరినీ అప్రమత్తం చేయడానికి మూడు విధానాలు పాటిస్తారు. అందులో ఒకటి.. ప్రత్యేకంగా శబ్దం వచ్చే సైరన్ మోగించడం. అలానే రాత్రయినా, పగలైనా వాహనం బాగా కనిపించేలా ప్రత్యేకమైన ఎరుపు, నీలం రంగుల్లో తిరిగే లైటును అంబులెన్స్ పై ఏర్పాటు చేస్తారు. అంబులెన్స్ వాహనాన్ని దాని ముందు వాహనాదారులు గుర్తించేలా దానిపై అక్షరాలను తిరగరాసి ఉంటాయి.
రోడ్డు మీద వెళ్లే వాహనాల డ్రైవర్లందరూ తమ వెనుక ఏయే వాహనాలు వస్తున్నాయో తెలుసుకోడానికి ‘రియర్ వ్యూ మిర్రర్’ అనే అద్దం ఉపయోగిస్తారు. ఈ అద్దం ద్వారా చూసినప్పుడు వెనుక వాహనంపై ఉండే అక్షరాలు స్పష్టంగా కనబడుతుంటాయి. అలానే అక్షరాలను తిరగ రాస్తే.. ఇంకాస్త స్పష్టంగా కనిపిస్తాయంట. అందుకే అంబులెన్స్ వాహనం మీద రాసిన అక్షరాలు సరిగా కనబడటానికి వాటిని తిరగేసి రాస్తారు. దీని వల్ల ముందున్న వాహనదారులు.. అంబులెన్స్ ను గమనించి దారి ఇస్తారు. ఇలా అత్యవసర సమయాల్లో అంబులెన్స్ లో ఆస్పత్రులకు తీసుకెళ్లి ఎందరో ప్రాణాలు కాపాడ పడ్డాయి. మరి.. అంబులెన్స్ పై రాసిన ఇంగ్లీష్ అక్షరాలు తిరగేసి రాయడం వెనుక గల ఈ కారణంపై మీ అభిప్రాయాలాను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.