ప్రతి మనిషికి జీవితంలో కష్టాలు వస్తాయి. ఈ క్రమంలో వారి సత్తా కూడా బయటికి వస్తుంది. విద్య వ్యక్తిని శక్తిగా మార్చుతుంది. లక్ష్యాన్ని చేరాలని గట్టి సంకల్పం ఉంటే పేదరికాన్ని జయించవచ్చు. పట్టుదల, సాధించాలనే కసి ఉన్నంతవరకు ప్రపంచంలో ఏదీ ఆపలేదు.
ప్రపంచంలో చదువు ఒక్కటే మనిషి జీవితాన్ని మార్చగలదు. వ్యక్తి ఆర్థిక పరిస్థితిని చదువు మార్చుతుంది. చదువు వలన ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. ప్రతి మనిషికి జీవితంలో కష్టాలు వస్తాయి. ఈ క్రమంలో వారి సత్తా కూడా బయటికి వస్తుంది. విద్య వ్యక్తిని శక్తిగా మార్చుతుంది. లక్ష్యాన్ని చేరాలని గట్టి సంకల్పం ఉంటే పేదరికాన్ని జయించవచ్చు. పట్టుదల, సాధించాలనే కసి ఉన్నంతవరకు ప్రపంచంలో ఏదీ ఆపలేదు. నల్గొండ జిల్లాకు కస్తాల గ్రామానికి చెందిన యువకుడు తన అకుంఠిత దీక్షతో పీహెచ్‌డీ సాధించి పేదరికాన్ని తరిమికొట్టాడు. డాక్టరేట్ సాధించి ఆ ఊరికే ఆదర్శప్రాయమయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
షేక్ సయ్యద్ మియా అనే యువకుడు నల్గొండ జిల్లా చండూరు మండలం కస్తాల గ్రామానికి చెందిన వ్యక్తి. అతని తల్లి మదార్ బీ, తండ్రి షేక్ హుస్సేన్. వీరిది పేద కుటుంబం. సయ్యద్‌కు చదువు అంటే చాలా ఆసక్తి కనబరిచేవాడు. అతడు 10వ తరగతి చదువుకునే రోజుల్లోనే తన తండ్రిని కోల్పోయాడు. సయ్యద్ 10 వ తరగతి మధ్యలోనే చదువు ఆపేద్దామని అనుకున్నాడు. అయితే టీచర్స్ ఎంకరేజ్ మెంట్ వల్ల పదో తరగతి పూర్తి చేశాడు. ఇంటర్మీడియేట్ కోసం నల్గొండ ప్రభుత్వ కాలేజీలో జాయిన్ అయ్యాడు. అక్కడ జిల్లా ప్రథమ ర్యాంకు పొందాడు. దీంతో జాతీయ ఫెల్లోషిప్ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యాడు. తర్వాత రాంరెడ్డి అనే లెక్చరర్ డబ్బులు సాయం చేయడంతో డిగ్రీ కంప్లీట్ అయ్యింది. పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిచేసి.. పీజీలో కూడా ప్రథమ ర్యాంక్ సాధించాడు. డాక్టర్ జీ. అంజయ్య గారు సయ్యద్‌ను ఇంటి మనిషిలా చూసుకునేవారని గుర్తుచేసుకున్నాడు.
ఈ సందర్భంగా సయ్యద్ మాట్లాడుతూ.. ‘నా చదువుకు స్నేహితులు బాగా సహాయం చేశారు. ఆ తర్వాత రాంరెడ్డి మాస్టారు.. మా గ్రామ ప్రజలందరి సేవలు అస్సలు మర్చిపోను. నాకు ప్రతిక్షణం అండదండగా నిలిచింది గ్రామ ప్రజలు.. నా స్నేహితులే. నేను ఏ కష్టాల్లో ఉన్న నన్ను ముందుండి నడిపించి మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. నీ రీసెర్చ్‌కి ఎంతగానో వారు సహాయపడ్డారు. నాకు ప్రోత్సహించిన వారందరికీ కృతజ్ఞతలే తెలుపుతున్నాను. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని అనుకుంటున్నాను’ అన్నాడు.
చదువును నమ్ముకున్నందుకు 2019లో జూనియర్ పంచాయతీ ఉద్యోగం వచ్చిందని తెలిపాడు. అప్పటినుండి కొంచెం కష్టాలనుండి గట్టెక్కినట్లు తెలిపాడు సయ్యద్. అతని పీహెడ్‌డీ లక్ష్యం అతనిని ఎప్పుడూ నిద్రపోనివ్వలేదని తెలిపాడు. రోడ్డు పక్కన చిన్న టీ కొట్టుతో కుటుంబాన్ని పోషించానని, తన పెద్దకొడుకే కుటుంబానికి పెద్ద దిక్కయ్యాడని తల్లి మదార్ బీ చెప్పింది. పిల్లలకు తినడానికి ఏమీ లేని రోజు ఊరిలో యాచించిన పరిస్థితులను గుర్తుకు తెచ్చుకుని బాగా ఎమోషనల్ అయ్యింది. ఇప్పుడు తన కొడుకు గర్వంగా తలెత్తుకునేల చేశాడని చెప్పుకొచ్చింది. సయ్యద్ స్నేహితులు.. సయ్యద్ జీవితం ఎంతో పేదవారికి స్ఫూర్తిదాయకం అంటున్నారు. తాము ఆర్థికంగా మెరుగ్గా ఉన్నాకూడా చదువులో రాణించలేకపోయామని.. సయ్యద్ ఆర్థికంగా చాలా కష్టాల్ని ఎదుర్కొని కూడా విజయం సాధించారని సయ్యద్ మిత్రులు పేర్కొన్నారు.