ఈ మద్య రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న రాజకీయ నాయకులు తమ మంచితనాన్ని చాటుకుంటు వారికి సహాయంగా నిలుస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే కిషోర్ గాదరి తమ ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..
జనగామ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి.. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. అదే సమయంలో జనగామ జిల్లా పర్యటనలో భాగంగా అటుగా వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి ప్రమాదానికి గురైన విషయం తెలుసుకొని వెంటనే తన కాన్వాయ్‌ను ఆపారు. క్షతగాత్రులను దగ్గరుండి జనగామ దవాఖానకు తరలించారు. వైద్యులతో మాట్లాడి వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.
మరొక సంఘటనలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ప్రమాద బాధితులకు అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. సూర్యాపేట –జనగాం రహదారిలో బైక్-ఆటో ఢీకొని ప్రమాదానికి గురయ్యాయి. అటుగా వస్తున్న ఎమ్మెల్యే గాదరి కిషోర్ కి ఈ విషయం తెలియడంతో వెంటనే తన వాహనాన్ని ఆపి ప్రమాదానికి గురైన వారికి వాహనం ఏర్పాటు చేసి వారిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రి తరలించారు. మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌కు సూచించారు.