ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం.. కొన్నిసార్లు అనుకోని ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి.
ఇటీవల దేశంలో ప్రతిరోజూ ఎక్కడో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పదులు సంఖ్యల్లో అమాయకులు ప్రాణాలు పోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం, మద్యం సేవించి నడపడం లాంటివి ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలు అని అధికారులు అంటున్నారు. కొన్నిసార్లు బస్సుల్లో టెక్నికల్ ఇబ్బందుల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా సూర్యాపేట హైవేపై రెండు ఆర్టీసీ బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. వివరాల్లోకి వెళితే..
సూర్యపేట జిల్లా చివ్వెంల గ్రామ శివారులో హైదరాబాద్-విజయవాడ నేషనల్ హై వేపై ఏపీఎస్ ఆర్టీసికి చెందిన రెండు బస్సులు ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని కాలిపోయాయి. ఆదివారం వేకువ జామునే హైదరాబాద్ నుంచి విజవాడ వెళ్తున్న ‘వెన్నె’ బస్సులో టెక్నికల్ లోపం తలెత్తింది. ఈ క్రమంలో బస్సులోని లైట్లు ఒక్కసారిగా ఆగిపోయాయి.. దీంతో బ్యాటరీలో ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకొని బస్సును ఆపివేశారు. ప్రయాణీకులను వేరే బస్సుల్లో పంపించారు. తర్వాత సూర్యాపేట నుంచి ఏపీఎస్‌ఆర్టీసీకే చెందిన వేరే బస్సును తీసుకు వచ్చి వైర్ల సహాయంతో రెండు బస్సుల మద్య బ్యాటరీ సమస్ను పరిష్కరించేందుకు ప్రయత్నించారు.
సూర్యాపేట నుంచి వచ్చిన బస్సులో పెద్ద శబ్ధం వచ్చి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో ముందు ఉన్న బస్సుకుకు మంటలు అంటుకొని క్షణాల్లోనే రెండు బస్సులకు మంటలు అంటుకొని పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆ సమయంలో రోడ్డుపై పెద్దు ఎత్తున మంటలు పొగలు రావడంతో అటుగా వెళ్లున్న ప్రయాణీకులు భయంతో వణికిపోయారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేవారు. కాకపోతే అప్పటికే ప్రయాణీకులను వేరే బస్సులో పంపించి వేయడంతో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.