కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈమధ్య కాలంలో తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు, పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక తాజాగా మరోసారి ఆయన పేరు వార్తల్లో నిలిచింది. కారణం
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజకీయాల్లో ఎంత దూకుడుగా ఉంటారో.. నియోజకవర్గ ప్రజలను ఆదుకోవడంలోనూ.. వారి సమస్యలు పరిష్కరించడంలో కూడా అంతే దూకుడు ప్రదర్శిస్తారు. సాయం చేయండి అంటూ వచ్చిన వారిని ఆదుకోవడంలో ఏమాత్రం వెనకడుగు వేయరు. ఇక తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు కోమటిరెడ్డి. హాత్విక్‌ను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఆయన నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు హాత్విక్ ఎవరు.. ఎందుకు కోమటిరెడ్డి ఆయనను దత్తత తీసుకుంటున్నారు అంటే..
హైదరాబాద్ కుషాయిగూడలో ఆదివారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో.. చిన్నారి సహా దంపతులు సజీవదహనం అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నరేష్, అతడి భార్య సుమ, కుమారుడు జస్విత్ మృతి చెందారు. వీరి స్వగ్రామం సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం, రెడ్డిగూడెం. ఈ క్రమంలో సోమవారం.. నరేష్ స్వగ్రామంలో వీరికి అంత్యక్రియలు నిర్వహించారు. మృతి చెందిన నరేష్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు హాత్విక్ కాగా.. రెండో కుమారుడు జస్విత్. అయితే అగ్నిప్రమాద ఘటనలో జస్విత్ మృతి చెందాడు. ఆ సమయంలో హాత్విక్ ఇంట్లో లేకపోవడంతో బతికి బయటపడ్డాడు.
ఈ ప్రమాదం గురించి తెలసుకున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. హాత్విక్‌ను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన.. తన పీఏ ద్వారా.. హాత్విక్ పేరిట బ్యాంకులో లక్ష రూపాయలు డిపాజిట్ చేయించారు. ఇక ఖర్చుల నిమిత్తం… నరేష్ తల్లిదండ్రులకు 25 వేలు అందజేసే ఏర్పాటు చేశారు. నరేష్ తల్లిదండ్రులకు కాల్ చేసి వారితో మాట్లాడి ఓదార్చారు. కొడుకు పోయిన బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని.. ధైర్యంగా ఉండమని నరేష్ తల్లిదండ్రులకు చెప్పారు. అంతేకాక.. వారి కుటుంబానికి అండగా ఉంటానని.. నరేష్ కొడుకు హాత్విక్‌ను దత్తత తీసుకుని.. ఇంటర్నేషన్‌లో స్కూల్‌లో చదివిస్తానని తెలిపారు. హాత్విక్ పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని.. ఢిల్లీ నుంచి వచ్చాక.. గ్రామానికి వచ్చి నరేష్ కుటుంబ సభ్యులను కలుస్తానని తెలిపారు కోమటిరెడ్డి.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొడుకు ప్రతీక్ రెడ్డి.. 2011, డిసెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడ. ప్రతీక్ రెడ్డి సీబీఐటీ కాలేజీలో బీటెక్ చదువుతుండగా.. రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఔటర్ రింగ్ రోడ్ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. కొడుకు మృతి.. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కుదిపేసింది. ఈ విషాదం నుంచి కోలుకోవడానికి ఆయనకు చాలా సమయం పట్టింది. ఇక తాజాగా నరేష్ మృతి చెంది అతడి కుమారుడు, తల్లిదండ్రులు అనాథలు కావడంతో.. కోమటిరెడ్డికి నాడు తాను అనుభవించిన బాధ గుర్తుకు వచ్చింది. అందుకే ఇలా మాట్లాడారు. ఇక కోమటిరెడ్డి తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
హైదరాబాద్ కుషాయిగూడ అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవదహనమవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన నరేశ్(35), అతని భార్య సుమ(35), వారి కుమారుడు జశ్విత్(6) ప్రమాదంలో మృతి చెందడంపై బాధాకరం.
1/4 pic.twitter.com/N8BhVt8Ty1
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) April 17, 2023