మద్యం ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టడమే కాక.. ఎందరినో బలి తీసుకుంటున్న మహమ్మారి. మద్యం మత్తులో చోటు చేసుకుంటున్న నేరాలకు లెక్కేలేదు. మందు తాగిన మత్తులో కొందరు దారుణాలకు పాల్పడితే.. మరి కొందరు తలతిక్క పనులు చేసి.. తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాగిన నిషాలో అసలు ఏం చేస్తున్నామో.. వారికి తెలియదు. స్పృహలో లేకుండా ప్రవర్తిస్తుంటారు. అలా ప్రవర్తించిన ఓ వ్యక్తి చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మందులో మంచినీళ్లకు బదులుగా యాసిడ్ కలుపుకొని తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. చివరకు ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: Chappals Stolen: రూ.180 ఖరీదైన చెప్పులు పోయాయంటూ రైతు ఫిర్యాదు.. ఆ లాజిక్ కరెక్టే అన్న పోలీసులు!
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామంలో మహేశ్ అనే 29 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సింగరేణిలో పని చేస్తూ ఉండేవాడు. అతడికి మద్యం సేవించే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే గత నెల 18న మద్యం తాగుతూ.. ఆ మత్తులో మంచి నీరు అనుకొని యాసిడ్ బాటిల్‌లోని యాసిడ్‌ను మద్యంలో కలుపుకుని తాగాడు. దీంతో అప్పటికప్పుడే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇది గుర్తించిన అతడి కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పట్నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్ తాజాగా మృతి చెందాడు. కాగా, మహేశ్‌కు భార్య స్వర్ణలత, కుమారుడు, కూతురు ఉన్నారు. దీనిపై హాజీపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో ఉన్న యాసిడ్ కూడా రంగు లేకుండా నీళ్ల తరహాలో కనిపించడంతో ఈ పొరపాటు జరిగి ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మరి ఈ దురదృష్టకర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Gujarat: మరికొన్ని గంటల్లో పెళ్లి.. డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ వరుడు మృతి!