కరోనా తగ్గిపోయిందని భావించిన కొద్ది రోజులకే దాని పంజా విసురుతోంది. కొత్త వేరియంట్లతో మరోసారి ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా మహీంద్ర యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ లో కరోనా కలకలం రేపింది. శనివారం చేసిన పరీక్షల్లో 30 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వెంటనే మహీంద్ర యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ ను మూసివేశారు. ప్రత్యక్ష తరగతును బహిష్కరించారు. నవంబరు 29 నుంచి ఆన్ లైన్ లో తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
కరోనా నిర్ధరణ అయిన 30 మందిలో 25 మంది విద్యార్థులు కాగా.. ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. హాస్టల్స్ ను కూడా మూసివేసి.. విద్యార్థులను ఇళ్లకు పంపేశారు. తరగతులు ఆన్ లైన్ లోనే నిర్వహిస్తామన తెలిపినట్లు విద్యార్థు అన్నారు. దాదాపు 15 రోజుల పాటు మహీంద్ర యూనివర్సిటీ హైదరాబాద్ క్యాపంస్ లాక్ డౌన్ లోనే ఉంపబోతోంది. మూడో వేవ్ పొంచి ఉందా? మళ్లీ కేసులు విజృభిస్తాయా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ముప్పు పొంచి ఉందని.. అందరూ తప్పనిసరిగా గతంలో లాగే జాగ్రత్తలు తీసుకోవాలని. తప్పని సరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. మూడో దశ కరోనా రాబోతోందా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.