దేశంలో కరోనా సమయంలో లాక్ డౌన్ విధించడంతో అడవుల్లో ఉండాల్సిన కృర మృగాలు జనారణ్యంలోకి రావడం.. వాటిని చూసి జనాలు పరుగులు తీయడం చూస్తున్నాం. కొన్ని కృర జంతువుల వల్ల ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అడవులకు ఆనుకొని ఉంటున్న గ్రామాల్లో చిరుతలు, ఏనుగులు, పులులు, ఎలుగుబంట్లు.. హల్ చల్ చేస్తున్నాయి.
చిరుత, ఎలుగు లాంటి కృర మృగాలు సాదు జంతువులపై దాడులు చేయడమే కాదు.. ఒక్కోసారి మనుషులపై కూడా దాడి చేసి చంపేసిన ఘటనలు జరిగాయి. ఒక రైతు తన జొన్న చేను కోతలో పనిలో ఉన్నాడు.. అదే సమయంలో ఒక చిరుతపులి సడెన్ గా ప్రత్యక్షం కావడంతో మనోడు గుండె గుభేల్ అంది. అయితే ఆది చేనులోకి ఎలా ఎప్పుడు వచ్చిందో తెలియదు.. ఈ ఘటన ఆదిలాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
కప్పర్ల గ్రామానికి చెందిన పరమేశ్వరన్ అనే ఒక రైతు జోన్న సాగు చేస్తున్నాడు. అది కోతకు రావడంతో హర్వేస్టర్‌తో తన పని మొదలు పెట్టాడు.. అదే సమయంలో ఒక చిరుత పులి ప్రత్యక్షం అయ్యింది. మొదట ఇద్దరూ భయపడ్డా.. తర్వాత గట్టిగా అరవడం మొదలు పెట్టారు. ఓ వైపు హార్వెస్టర్ శబ్దం మరోవైపు ఇద్దరి అరుపు విన్న చిరుత అటవీప్రాంతం వైపు పరుగు తీసింది. చిరుత సంచారం గురించి కప్పర్ల సర్పంచ్ సదానందం సమాచారం అందించారు.
ఆ తర్వాత అధికారులు ఘటన స్థలానికి చేరుకొని అంతా పరిశీలించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. పంటచేనులో చిరుత పరుగులు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.