సినీ ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యభరిత పాత్రల్లో నటించిన తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు నటుడు ప్రకాశ్ రాజ్. ఎలాంటి పాత్ర అయినా అందులో పరకాయ ప్రవేశం చేసినట్లు నటిస్తుంటారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనే కాకుండా ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు. ఇటీవల ఆయన రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఆ మద్య ‘మా’ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు.
ప్రకాశ్ రాజ్ నటుడు గానే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఎంతో మందికి నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి డబ్బు ఇచ్చి ఆదుకున్నారు. రాజకీయాల్లో కూడా ఆయన చురుకుగా పాల్గొంటున్నారు. ఇటీవల కొంత మంది సెలబ్రెటీలు తెలంగాణ లో కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్ తెలంగాణలోని కొండారెడ్డిపల్లి అనే గ్రామాన్ని దత్తత తీసుకొని ఎంతో సుందరంగా మార్చారు. గ్రామాల్లో చెట్లు నాటించి హరిత వణంగా తీర్చి దిద్దారు… అలాగే ఊరిలో చక్కటి రోడ్లను ఏర్పాటు చేశారు. ఆయన దత్తత తీసుకున్నప్పటి నుంచి పలు మార్లు సందర్శించి అక్కడ గ్రామస్థుల కోసం వైద్య శిభిరాలు కూడా ఏర్పాటుచేయించారు.
గ్రామంలో మంచి నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయించారు. ఇలా స్థానిక ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి ఎన్నో అభివృద్ది పనులు చేపట్టిన నటుడు ప్రకాశ్ రాజ్ ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎంతగానో మెచ్చుకున్నారు. డబ్బు సంపాదించడం వరకే కొంత మంది పరిమితం అవుతుంటారు.. కానీ దాన్ని సద్వినియోగం చేసి పదిమందికి ఉపయోగ పడేలా చేసేవారు గొప్పవారు అవుతారు అన్నారు. తెలంగాణ లో ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకొని గ్రామాన్ని ఎంతో గొప్పగా అభివృద్ది చేయడం సంతోషం అనిపిస్తుందని ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This is the village adopted by @prakashraaj
Great progress made in tandem with local MLA @AnjaiahYTRS Garu 👏 https://t.co/yGfYdloaFT
— KTR (@KTRTRS) September 20, 2022