టికెట్లు లేని ప్రయాణం నేరం అని తెలిసి కూడా చాలా మంది నిర్లక్య ధోరణితో వ్యవహరిస్తుంటారు. మనల్ని ఎవరు పట్టుకుంటారులే అన్న ధీమాతో టికెట్ తీసుకోకుండానే రైలు ఎక్కేస్తుంటారు. టీసీలు వచ్చి తనిఖీలు చేసే సరికి నలుగురు ముందు పరువు పొగొట్టుకోలేక జరిమానాలు కడుతుంటారు. అనేక మంది ప్రయాణీకులున్నారు ఇదే బాపతు. వీరి నుండి వసూలు చేసిన జరిమానాలు కోట్లను దాటుతున్నాయట.
టికెట్లు లేని ప్రయాణం నేరం అని తెలిసి కూడా అనేక మంది రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తూ ఉంటారు. ముఖ్యంగా రైలులో టికెట్ లేని వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. టికెట్ లేకుండా ప్రయాణం చేయరాదని, అట్టివారు శిక్షార్హులని పెద్ద పెద్ద మైకుల్లో ప్రకటనలు చేసినా వినిపించుకోని ప్రయాణీకులెందరో. టికెట్ కలెక్టర్ చెక్ చేయడన్న ధీమాతో ఉండిపోయి.. టికెట్ తీయకుండానే రైలు ఎక్కుస్తుంటారు కొందరు ఆకతాయిలు. తీరా తనిఖీల సమయంలో జరిమానాలను ఎదుర్కొన్నవారున్నారు. అయితే టికెట్ తీయకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ప్రయాణీకులపై భారత రైల్వే దృష్టి సారించింది. రైళ్లల్లో తనిఖీలను ముమ్మరం చేసింది. దీంతో జరిమానాల రూపంలో వస్తున్న ఆదాయాన్ని చూసి రైల్వే అధికారులు విస్తుపోతున్నారట. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణాల్లోని ఓ ప్రధాన రైల్వే స్టేషన్‌ల్లో వసూలు చేసిన జరిమానా వింటే తెల్లబోవాల్సిందే.
టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తున్నవారిపై దక్షిణ మధ్య రైల్వే దృష్టి సారించింది. టికెట్ లేకుండా ప్రయాణించిన వ్యక్తుల నుండి జరిమానా వసూలు చేస్తే రైల్వేకు భారీ ఆదాయం సమకూరింది. ఏపీతో పాటు తెలంగాణ ప్రధాన స్టేషన్లలో కూడా భారీగా జరిమానాలు వసూలయ్యాయి. రోసాలైన్ అరోకియా మేరీ అనే మహిళా చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ అక్రమంగా ప్రయాణీస్తున్న వ్యక్తులకు విధించిన జరిమానాల ద్వారా రూ.1.03 కోట్లు వసూలు రాబట్టారు. కాగా, కోటి రూపాయలకు పైగా పెనాల్టీల ద్వారా అత్యధికంగా వసూలు చేసిన తొలి మహిళా ఉద్యోగినిగా నిలిచారు. డిప్యూటీ చీఫ్ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ ఎస్ నంద కుమార్ 27,787 కేసులు నమోదు చేసి రూ.1.55 కోట్లు జరిమానా వసూలు చేశారు. అలాగే విజయవాడ డివిజన్‌లో ఎంజె.మాథ్యూ అనే చీఫ్ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ కోటి రుపాయల జరిమానాలు వసూలు చేశారు. ఈయన గుడివాడ స్క్వాడ్‌లో పనిచేస్తున్నారు. ఏడాది కాలంలో టికెట్ లేని ప్రయాణీకులకు జరిమానా విధించి రూ.1.02 కోట్లు వసూలు చేశారు. ఎంజె.మాథ్యూ మొత్తం 12,707 కేసులు నమోదు చేశారు. 35ఏళ్ల కెరీర్‌లో మాథ్యూ జిఎం అవార్డుతో పాటు డిఆర్ఎం అవార్డు, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ అవార్డులు పొందారు. అత్యధిక కేసులు నమోదు చేసిన అధికారికి జిఎం నుంచి అభినందనలు దక్కాయి.
గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 16 వరకూ ఈ ముగ్గరు.. ఒక్కొక్కరు కోటి రూపాయాలకు పైగా టికెట్ లేని ప్రయాణీకుల నుండి జరిమానాల రూపంలో వసూళ్లను రాబట్టినట్లు దక్షిణ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకూ టిక్కెట్ చెకింగ్ స్టాఫ్ జరిమానా కింద వసూలు చేసిన అధిక మొత్తం ఇదే. వీరితో పాటు అలాగే, సీనియర్ టికెట్ ఎగ్జామినర్ శక్తివేల్ రూ.1.01 వసూలు చేసినట్టు దక్షిణ రైల్వే తెలిపింది. జరిమానాల విధించి అధిక మొత్తం వసూలు చేసిన దక్షిణ రైల్వే ఉద్యోగులను రైల్వే మంత్రిత్వశాఖ అభినందిస్తూ వారి ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది. తన విధుల పట్ల నిబద్ధతను కనబరిచి, టిక్కెట్ తీసుకున్నవారికి ప్రయాణం సౌకర్యవంతంగా సాగేలా చేస్తున్నారని ప్రశంసించింది. మరోవైపు, సికింద్రబాద్ రైల్వే డివిజన్‌లో కూడా మరో ఏడుగురు అధికారులు కోటికి పైగా జరిమానాలు వసూలు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం తొమ్మిది మంది రైల్వే తనిఖీ సిబ్బంది ఏకంగా రూ.9.62 కోట్లు వసూలు చేశారు. సగటున ఒక్కొక్కరూ రూ.కోటిని మించి వసూలు చేశారు.
Showing resolute commitment to her duties, Smt.Rosaline Arokia Mary, CTI (Chief Ticket Inspector) of @GMSRailway, becomes the first woman on the ticket-checking staff of Indian Railways to collect fines of Rs. 1.03 crore from irregular/non-ticketed travellers. pic.twitter.com/VxGJcjL9t5
— Ministry of Railways (@RailMinIndia) March 22, 2023