ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా కేజీయఫ్ కి సీక్వెల్ గా వచ్చిన కేజీయఫ్ 2 బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ‘కె.జి.యఫ్ చాప్టర్2’ మూవీ ఏప్రిల్ 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లను రాబడుతోంది. దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కేజీయఫ్ 2 మానియా నడుస్తుంది. ఇప్పటికే వెయ్యికోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే దిశగా ముందుకు సాగుతుంది.
2018 లో వచ్చిన డబ్బింగ్ సినిమా కేజీయఫ్ తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాడు యష్. అప్పటి వరకు ఇతను ఎవరో.. తెలీదు, ఇతని మొహం కూడా గతంలో చూసింది లేదు. ఒక్క తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ కేజీయఫ్ సూపర్ హిట్ అయ్యింది. ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు యష్.
కన్నడ నటుడే అయినా.. తెలుగు ప్రేక్షకుల నుంచి ఈస్థాయిలో అభిమానులు, ఆదరణ ఉండటం పెద్దవిషయమే. దేశ వ్యాప్తంగా యష్ కి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయ్యారు. హైదరాబద్ లో అనీల అనే ఒక యువతి యష్ అంటే పంచప్రాణాలు. అతని కోసం ఐదు కేజీల కేక్ తయారు చేసింది.. దాదాపు ఐదు రోజుల పాటు ఎంతో కష్టపడి యష్ ముఖం ఉన్న కేక్ తయారు చేసింది. యశ్ కేక్ ను వీడియో తీసి నెట్టింట్లో పెట్టగా.. ఆమె టాలెంట్ ను నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈ కేక్ యశ్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.