ఈ మధ్యకాలంలో ప్రతి వస్తువు ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. చివరికి ఫుడ్ ను సైతం ఆన్ లైన్ లో ఆర్డర్ పెడుతున్నారు. అయితే ఈ ఆన్ లైన్ షాపింగ్ లో అప్పుడప్పుడు అరుదైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. వినియోగదారులు ఆన్ లైన్ సంస్థలు దిమ్మతిరిగే షాక్ ఇస్తుంటాయి. తాజాగా ఓ మహిళ కేక్ ను ఆన్ లైన్ లో ఆర్డ్ చేసింది. రూ.500కి చిల్ల తెమ్మంటే.. అదే విషయాని కేక్ పై రాసుకొచ్చి..సదరు మహిళకు షాక్ ఇచ్చాడు డెలివరీ బాయ్. వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్రలోని ముంబైకి చెందిన వైష్ణవి అనే మహిళ.. తమ ఇంట్లో ఓ వేడుకకు కేక్ తెప్పించుకోవాలనుకుంది. దీంతో ఆన్ లైన్ లో ఓ ఫుడ్ డెలివరీ సంస్థ ద్వారా ఓ మంచి బేకరీ చూసుకుని కేక్ ను ఆర్డర్ చేసింది. అయితే ఆన్ లైన్ పేమెంట్ కాకుండా.. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకుంది. ఈక్రమంలో మహిళ వద్ద రూ.500 ఉంది. అయితే కేక్ కి సరిపోయే చిల్లర తన దగ్గర లేకపోవడంతో.. రూ.500కు చిల్లర తీసుకురండి (బ్రింగ్ 500 చేంజ్) అంటూ యాప్ లో డెలివరీ బాయ్ కు ఇన్ స్ట్రక్షన్ పెట్టింది. ఇక్కడి దాకా బాగానే ఉంది.. కానీ ఆ మెసేజ్ చూసిన డెలివరీ బాయ్.. ఇది కేక్ పై రాయడానికి పెట్టారేమోనని భావించాడు. దీంతో కేక్ పై బ్రింగ్ రూ.500 చేంజ్ అని ఇంగ్లిష్ లో రాసిపెట్టి పంపారు.
ఇంటికి వచ్చాకు పార్శల్ ఓపెన్ చేసి కేక్ పై రాసి ఉన్నదాన్నిచూసిన వైష్ణవి అవాకైయింది. ఏదో అంటే ఏదో అయిందంటూ కేక్ ఫొటోతో ఫేస్ బుక్ లో పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ ఫిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు సైతం కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. “హ్యాపీ బర్త్ డే బ్రింగ్ 500 చేంజ్” అంటూ కొందరు , అందుకే ఆన్ లైన్ లోనే క్యాష్ పే చేయలని, ఇక “డెలివరీ ఇన్ స్ట్రక్షన్ ఇచ్చారుగా. ఇంకే అలాగే వచ్చింది”, “కుకింగ్ ఇన్ స్ట్రక్షన్స్ లో రాశారేమో..”, ఇంకా నయం.. ఏమేమో రాయలేదు.. అని మరికొందరు కామెంట్లు పెట్టారు. మరి.. ఈవిషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Drunk And Drive: డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన దివ్యాంగుడు.. పోలీసులకి చుక్కలు..
ఇదీ చదవండి: Brimato: టమాటా లాంటి వంకాయని చూశారా? అదికూడా టమాటా చెట్టుకే!
ఇదీ చదవండి: వానదేవుడిపై చర్యలు తీసుకోవాలంటూ రైతు లేఖ.. పై అధికారికి సిఫార్సు చేసిన రెవెన్యూ అధికారి!