సినీ ఇండస్ట్రీలో కేజీఎఫ్ మూవీ ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ 2 ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి బాక్సాఫీస్ షేక్ చేసింది. ఇదిలా ఉంటే ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా కేజీఎఫ్ మూవీలో తాత పాత్రలో కనిపించిన కృష్ణ జీ రావు కన్నుమూశారు. గత కొంత కాలంగా శ్వాస సంబంధిం సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం బెంగుళూరు ఆస్పత్రిలో కన్నుమూశారు.
ఒక చిన్న పల్లెటూరిలో పుట్టి పెరిగిన ఆయన సినిమాలపై ఆసక్తితో 30 ఏళ్ళ క్రితం బెంగుళూరు కి వచ్చి సెటిలయ్యాడు. మొదట టైలరింగ్ వృత్తి చేపట్టి.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొడక్షన్ మేనేజర్ గా వివిధ భాగాల్లో పనిచేశాడు. కొన్ని చిత్రాలకు కథా రచయితగా కూడా పనిచేశారు. ఇదే సమయంలో కేజీఎఫ్ 2 మూవీలో ఛాన్స్ వచ్చింది. ఈ మూవీలో రాఖీ భాయ్ పవర్ ఏంటో విలన్లకు చెప్పే డైలాగ్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.
కేజీఎఫ్ 2 మూవీలో తాత పాత్రలో నటించిన కృష్ణ జీ రావు నిడివి తక్కువే అయినా ఫైట్ సీన్ ముందు కొట్టే పంచ్ డైలాగ్స్ బాగా పాపులర్ కావడంతో కృష్ణ జీ రావు బాగా ఫేమస్ అయ్యారు. ఈ మూవీ తర్వాత కృష్ణ జీ రావు కు ఇండస్ట్రీలో పలు అవకాశాలు వచ్చాయి. ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో ఓ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.. కానీ శ్వాస సంబంధింత బాధపడుతున్న ఆయన బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది.
KGF actor Krishna G Rao passes away. He was hospitalized following severe illness#Sandalwood #KGF2 #KFI #sandalwoodactors pic.twitter.com/gTWdWi0ECa
— Bangalore Times (@BangaloreTimes1) December 7, 2022