ఈ మధ్య యూనివర్స్ కథల ట్రెండ్ నడుస్తోంది. ఖైదీ, విక్రమ్ సినిమాలు.. హిట్ ఫ్రాంచైజ్ లో వచ్చిన సినిమాలు ఇవన్నీ చూస్తుంటే సినీ యూనివర్స్ లో ట్రావెల్ అయినట్టు ఉంటుంది. తాజాగా ప్రభాస్ నటిస్తున్న సలార్ కూడా కేజీఎఫ్ తో కనెక్షన్ కలిగి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ఫ్యాన్స్ టీజర్ లో కొన్ని స్క్రీన్ షాట్స్ ని చూపించి మరి అదిగో కనెక్షన్ అని అంటున్నారు. దీంతో సలార్ లో యష్ కూడా ఉంటాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ సలార్ టీజర్‌తో బరిలోకి దిగాడు. కేజీయఫ్ సిరీస్ లాంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్‌ను ఏ రేంజ్లో అయితే చూపించాలో ఆరేంజ్‌లో చూపించాడు. డార్లింగ్ ఫ్యాన్స్ అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా టీజర్లో చూపించాడు. ది మోస్ట్ వైలెంట్ మేన్.. కాల్డ్ వన్ మెన్ .. ది మోస్ట్ వైలెంట్ పేరుతో టీజర్‌ని తాజాగా విడుదల చేశారు. ఓ రకంగా చెప్పాలంటే ఈరోజు ఉదయం 5:12 నుంచే యూట్యాబ్‌లో తుఫాన్ మొదలైందని చెప్పవచ్చు. ఇది ప్రభాస్ అసలైన్ యాక్షన్ మూవీ అని ఫాన్స్ ట్వీట్ చేస్తున్నారు. టాలీవుడ్లో ప్రభాస్‌కు ఉండేది ఫ్యాన్స్ కాదు.. డైహార్ట్ ఫ్యాన్స్ ఉంటారు కాబ్టటి ఈ టీజర్‌ను ఒకటికి పది సార్లు అయినా చూసి ఉంటారు. ఇక ఈ టీజర్ విషయానికి వస్తే ఇందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఫ్యాన్స్ గుర్తించారు.
దీనితో కేజీయఫ్‌కు సలార్ కనెక్షన్ నిజమేనని తేలిపోయింది. ఇందులో యశ్ కూడా ఉంటారనేందుకు మరింత బలం చేకురింది. ఇది ప్రభాస్, యశ్ మధ్య అతిపెద్ద క్రాసర్ను సూచిస్తుంది. ప్రభాస్ సలార్ టీజర్ చూసిన తర్వాత కేజీయఫ్ -2కు సంబంధం ఖచ్చితంగా ఉందని తెలుస్తోంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అది నిజమేనని తెలిపేలా ఫ్యాన్స్ రెండు ఫోటోలను కూడా గుర్తించారు. సలార్, KGF-2 కు సంబంధించిన రెండు స్క్రీన్షాట్లను తీసి ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో కేజీయఫ్‌తో సలార్‌కు కనెక్షన్ నిజమేనని తేలిపోయింది. డార్లింగ్ ఫ్యాన్స్ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చేలా ఈ సీన్స్ ఉన్నాయి. వీటికి సంబంధించిన టీజర్లో చాలా క్లూస్ ఇచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. వాటి ద్వారా సలార్, కేజీయఫ్‌కు ఖచ్చితంగా కనెక్షన్ ఉందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌తో పాటు యశ్ కూడా సలార్‌లో జరిగే వార్‌లో కూడా ఉండబోతునట్లు తెలుస్తోంది.
అయితే ఆ వార్ సీన్లో ఇద్దరు కలిసి ప్రత్యర్ధి మీద ఫైట్ చేస్తారా లేక ఇద్దరి మధ్య వార్ ఉండబోతుందా అనేది తెలియాల్సి ఉంది. వీరిద్దరు పాన్ ఇండియా హిరోలే ఒకరి సినిమా విడుదలైతేనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కుప్పకులుతాయి. అలాంటిది వీరిద్దరూ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఇండియాన్ బాక్సాఫీస్ కాదు ప్రపంచం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టడం ఖాయమని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న మొదటి భాగం రానున్నట్లు మూవీ మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దీనితో ఇండియన్ సినమా చరిత్రలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రావడం ఖయానమని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరు పెద్ద స్టార్స్ ఒక సినిమాలో కలిసి నటించడం తెలుగు సినిమా ఇడ్రస్ట్రీకి మంచి చేకురుస్తుందని చెప్పవచ్చు. మరి ఇందులో ఎంత నిజం ఉందో అనే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.