మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాము. అయితే నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం చెప్పేందుకు అందరు సిద్ధమయ్యారు. న్యూయర్ వేడుకల కోసం పెద్దలు, యువత ఇప్పటికే ఎంతో ఉత్సహాంగా ఎదురు చూస్తున్నారు. రాబోయే ఏడాది తమకు అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నారు. సరికొత్త ఆశలు, లక్ష్యాలు, తీర్మానాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందు రెడి అయ్యారు. అయితే కొత్త సంవత్సర వేడుకలంటే అనేక రకాల విందులతో పాటు కేక్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. దాదాపు ప్రతి ఒక్కరు కేక్ కటింగ్ చేస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతుంటారు. ఇదే అదనుగా భావించి కొందరు వ్యాపారులు నాణ్యత లేని కేక్ లు తయారుచేసి అమ్ముతుంటారు. అందుకే న్యూయర్ కి కేక్ కొన్నే వారు కొన్ని జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
డిసెంబర్ 31 సాయంత్రం నుంచి మొదలయ్యే వేడుకల్లో.. సంవత్సరం మారే అపురూప క్షణాల కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అందులో భాగంగానే కొత్త సంవత్సరాన్ని ఎంజాయ్ చేసేందుకు అందరు ఇప్పటికే తమ ప్లాన్ లను సిద్ధం చేసుకుని ఉంటారు. నూతన సంవత్సరం అనగానే కేక్ కటింగ్ గుర్తుకు వస్తుంది. ప్రతి ఒక్కరూ కేక్ కటింగ్ తోనే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతుంటారు. అందుకోసమే డిసెంబర్ 31న సాయంత్ర నుంచే కేక్ షాపుల వద్ద జనాలు బారులు తీరి ఉంటారు. ఇదే సమయంలో వ్యాపారులు కూడా భారీ సంఖ్యలో కేక్ లు తయారు చేస్తుంటారు.
అప్పటికప్పుడు పెద్ద సంఖ్యలో కేక్ లను తయారు చేయడం చాలా కష్టం. అందుకే కొందరు వ్యాపారులు రెండు మూడు రోజుల ముందు నుంచే కేక్ లను సిద్ధం చేస్తుంటారు. వాటిని పెద్ద పెద్ద ఫ్రిజ్ లో దాచి.. అమ్ముతుంటారు. అయితే ఈ కేక్ ల తయారీలో కొందరు నాణ్యతను పాటించరనేది వాస్తవం. నాసిరకం బ్రేడ్, ఇతర పదార్ధాలతో వాటిని తయారు చేస్తుంటారు. సందడిలో సడేమియాలా ఎలా చేస్తే ఏముందిలే అన్నట్లు.. పాడైపోయిన పదార్ధాలను కూడా వదలకుండా కలిపేసి కేక్ తయారు చేస్తుంటారు. ఇలా తయారు చేసిన కేక్ లను తినడం వలన అనారోగ్యంతో ఆస్పత్రి పాలవుతారు. కొందరు వ్యాపారులు తమ స్వార్ధం కోసం నాణ్యతలేని కేక్ లను తయారు చేసి ప్రజలకు అంటగడుతుంటారు. ఇలాంటి కేక్ లను మనం కొనుగోలు చేయడం వలన ధనంతో పాటు ఆరోగ్యం నష్టపోతుంటాము.
అందుకే న్యూయర్ వేడుకల సమయంలోనే ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. కేక్ కొనడంపైనే కాకుండా.. వాటి నాణ్యతపై కూడా దృష్టి పెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ కొనడం మంచిది కాదు. నాణ్యమైన కేక్ లు తయారు చేసే బేకరీలను గుర్తించి.. అందులో కొనడం ఉత్తమం. ఇలా చేయడం వలన ఆరోగ్యంతో పాటు కొత్త సంవత్సర వేడుకలను సంతోషంగా జరుపుకోవచ్చు. దీనితో పాటు మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆనందంగా న్యూయర్ వేడుకలు జరుపుకోవాలి. మరీ… కొత్త సంవత్సర వేడుకల్లో కేక్ కొనుగోలు విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.