నగరాల్లో దోమల లార్వా అభివృద్ధి విపరీతంగా పెరిగిందని, గరిష్టంగా హైదరాబాద్ లో 46శాతం ఉందని తెలిపింది.కరోనా మహమ్మరి తగ్గుముఖం పట్టిందో లేదో జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు చుట్టుముడుతున్నాయి.ఈ లెక్కన నగర వాసులకు డెంగ్యూ ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క హైదరాబాద్ కాకుండా మిగతా జిల్లాల్లోనూ ఇది పెరిగిందని, ప్రతీ జిల్లాలో 10% పెరిగినట్లు చెబుతున్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లు, హైదరాబాద్ లోని ఫీవర్, నీలోఫర్, ఉస్మానియా మొదలగు ఆస్పత్రుల్లో డెంగ్యూ కిట్లు సిద్ధం చేస్తున్నారు. సీజన్ ప్రారంభంలోనే డెంగ్యూ జ్వరాలు డేంజర్ బెల్స్ మోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
సాధ్యమైనంత వరకు దోమలను నివారించడం డెంగ్యూని నివారించడానికి ప్రధాన మార్గం. దోమలను నివారించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడా నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇందులో దోమలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డెంగ్యూ లేదా ఇతర సమస్యల లక్షణాలు ఉన్నట్లయితే, ఔషదాలు తీసుకునే ముందు తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి.
వర్షాకాలం కారణంగా దోమల బెడద బాగా పెరిగింది. ముఖ్యంగా నగరాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. నాళాల్లో లార్వా అభివృద్ధి తీవ్రంగా ఉండడంతో ఆ ప్రాంతాల్లోని వారికి డెంగ్యూ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో అధికార్లు నిర్లక్ష్యం చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. నాళాలను పరిశుభ్రంగా ఉంచకపోవడం, నీరు నిల్వ ఉండేలా చేయకపోవడం వంటి చర్యలు తీసుకోనందు వల్లే డెంగ్యూ విజృంభిస్తుందని నగర ప్రజలు అంటున్నారు.
గతేడాది ఇదే కాలానికి చికున్ గున్యా కేసులు 21 నమోదు కాగా, ఈ ఏడాది 52 కేసులు నమోదయ్యాయి. డెంగీకి కారణమైన దోమ పగలే కుడుతుంది. కానీ నగరాలు, పట్టణాల్లో రాత్రిళ్లు అదిరిపోయే కాంతులు ఉంటుండటంతో దోమ కూడా రూటు మార్చిందని డాక్టర్‌లు అంటున్నారు. జ్వరం, తలనొప్పి, చర్మంపై మశూచి లాంటి దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా డెంగ్యూ జ్వరం వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.