బిగ్ బాస్ పుణ్యమా అని ఫేమ్ లోకి వచ్చిన సోషల్ మీడియా స్టార్ లలో అషు రెడ్డి ఒకరు. మొదటగా డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ దక్కించుకున్న అషు రెడ్డి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘ఛల్ మోహన్ రంగ’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొని టీవీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమైంది.
బిగ్ బాస్ అనంతరం అషు రెడ్డి.. అడపాదడపా సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో మెరుస్తోంది. ఈ మధ్యకాలంలో టీవీ ప్రోగ్రాంలలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే.. అషుకి వివాదాలలో నిలవడమంటే చాలా ఇష్టమని అంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే.. సోషల్ మీడియాలో అషు రెడ్డి చేసే రచ్చ మాములుగా ఉండదు. ఇటీవలే యాంకర్ అరియానా నడుము పై కిస్ చేస్తూ వార్తల్లో నిలిచిన అషు.. తాజాగా యాంకర్ రవికి ముద్దిస్తా అంటూ మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఇంస్టాగ్రామ్ అంటే.. రీల్స్ అనేవి చాలా కామన్. యాంకర్ రవితో కలిసి అషు తాజాగా ఓ డైలాగ్ వీడియో రీల్ చేసింది. ఆ వీడియోలో రవిని అన్న అంటూనే ముద్దిస్తా.. అంటుంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పే సీన్ లో డైలాగ్స్ తో ఈ రీల్ చేశారు రవి, అషు రెడ్డి. ‘ఎవతిరా ఇది.. అన్న అని.. ముద్దిస్తా అంటోంది.. యాడ దొరికిన సంతరా’ అంటూ రవి చెప్పిన డైలాగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరి ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.