సమీరా రెడ్డి.. తెలుగు వారికి పరిచయం అవసరం లేని పేరు. “నరసింహుడు, జై చిరంజీవ, అశోక్” వంటి చిత్రాలలో తన గ్లామర్ తో కుర్రాళ్ల మనసు దోచింది ఈ అమ్మడు. తెలుగులోనే కాకుండా తమిళ్ లో సూర్య నటించిన “సూర్య సన్నాఫ్ కృష్ణన్” చిత్రంతో సమీరా చాలా మంది ప్రేక్షకులకు దగ్గర అయ్యింది. ఇక సినిమాలకి దూరం అయినప్పటి నుండి సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో టచ్ లోనే ఉంటుంది ఈ అమ్మడు. అయితే.. తాజాగా సమీరా రెడ్డి తన అనారోగ్య విషయాన్ని బయటపెట్టి అందరికి షాక్ ఇచ్చింది.
సమీరా రెడ్డి.. తన షాకింగ్ సీక్రెట్ ను రివీల్ చేసింది. 2016లో తాను అరుదైన ‘అలోపేసియా’ అనే వ్యాధికి గురైనట్లు తెలిపింది. “నా భర్త అక్షయ నా తలపై రెండు ఇంచుల జట్టు ఊడిపోవడం గమనించాడు. ఆ వ్యాధిని ఎదుర్కొవడం చాలా కష్టం. అది అనారోగ్యానికి గురిచేయదు కానీ మానసికంగా కుంగదీస్తుంది. ఆ విధంగానే మనిషి కుంగుబాటుకు గురవుతాడు” అని సమీరా రెడ్డి తెలిపింది. నటుడు విల్ స్మిత్ భార్య అలోపేసియా అనే వ్యాధితో బాధపడుతున్న పింకెట్ స్మిత్ గుండు చేయించుకుని ఉండగా..ఇటీవల అస్కా ర్ అవార్డు కార్యక్రమంలో ఆమె లుక్ మీద క్రిస్ జోక్ వేశాడు. దీంతో విల్ స్మిత్ స్టేజ్‌పై మాట్లాడుతున్న అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ చెంప చెళ్లుమనిపించాడు. ఈ నేపథ్యంలో తనకు వచ్చిన అదే వ్యాధి గురించి హీరోయిన్ సమీరా రెడ్డి బయటపెట్టింది. అయితే ప్రస్తుతం ఆరోగ్యంగా సమీరా తెలుగులో జై చిరంజీవ , అశోక్ చిత్రాల్లో నటించింది.
అసలు అలోపేసియా అంటే ఏమిటి?
అలోపేసియా అరేటా అనేది స్త్రీ, పురుషుల్లో సంభవించే ఓ అసహ్యకరమైన వ్యాధి. అలోపేసియా అరేటా కూడా ఆటో ఇమ్యూన్ వ్యాధిగా భావిస్తారు, తద్వారా రోగనిరోధక వ్యవస్థ దాడి చేసి శరీర కణజాలం పొరపాటున నాశనం చేస్తుంది. ఈ రకమైన అలోపేసియా పురుషులు మరియు మహిళలు మరియు పిల్లలలో కనిపిస్తుంది. దురద లేదా మంటతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నప్పటికీ, సాధారణంగా జుట్టు రాలడం మాత్రమే లక్షణం. మొత్తం అలోపేసియా కేసులలో, లక్షణాలు ప్రారంభమైన 6 నెలల తర్వాత నష్టం ఎక్కువ సంభవిస్తుంది.ఈ పరిస్థితి యొక్క కోర్సును ఏ చికిత్స మార్చగలదో ఇంకా స్పష్టంగా తెలియలేదు. స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, చర్మానికి వర్తించే మందులు, అతినీలలోహిత కాంతి చికిత్స మొదలైన సాధారణ చికిత్సలు ఉన్నాయి. మరి.. విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.