Viral : ఈ సృష్టిలో ఒక జీవి ప్రాణాలు నిలబెట్టడం అనేది చాలా పెద్ద విషయం. ఇది అందరికి సాధ్యం అయ్యే పని కాదు. డాక్టర్స్ ఆ పని చేస్తారు కాబట్టి.. వారిని అంతా దేవుడిలా చూస్తారు. కానీ.., సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే సాధారణ ప్రజలు కూడా ఒక జీవి ప్రాణాలను నిలబెట్టవచ్చు అని నిరూపించాడు ఆ ఓ వ్యక్తి. ఆ వివరాల్లోకి వెళ్తే.. తను వెళ్లే దారిలో ఓ వ్యక్తికి .. స్పృహ కోల్పోయి పడిపోయిన శునకం కనిపించింది. అందరిలా అతను నాకెందుకులే అనుకోకుండా ఆ కుక్క దగ్గరికి వెళ్లి, దాని పరిస్థితిని గమనించాడు. కారణం ఏమిటో తెలియదు గాని.. ఆ కుక్క అప్పటికే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నట్టు అతను గుర్తించాడు. వెంటనే ఆ కుక్కకి సీపీఆర్ చేశారు. దాని ఛాతిపై గట్టిగా నొక్కడం మొదలుపెట్టాడు. అలా నొక్కిన కొంతసేపటికి కుక్క చటుక్కున లేచింది. బతికాను రా దేవుడా అన్న రీతిలో అక్కడ నుంచి పరుగులు పెట్టింది.
ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. “కొన్నిసార్లు అద్భుతాలు మంచివారి చేతుల మీదుగానే జరుగుతుంటాయి” అంటూ ఆయన ఈ ట్వీట్ కి క్యాప్షన్ యాడ్ చేశారు. దీంతో.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి మనలో చాలా మందికి కుక్కలు అంటే ఇష్టం. కొంతమంది అయితే వీటిని సొంత పిల్లలులా పెంచుకుంటూ ఉంటారు. అలాంటి వారంతా ఇప్పుడు ఈ వీడియోని చూసి.., ఆ యువకుడిని తెగ మెచ్చుకుంటున్నారు. కొంతమంది వైద్యులు మాత్రం ఈ వీడియో సీపీఆర్ ప్రాముఖ్యతని తెలియజేస్తోంది. సీపీఆర్ గనుక చేయడం తెలుసుకుంటే.. చాలామంది ప్రాణాలను ఇలాగే కాపాడవచ్చు అని చెప్తున్నారు. మరి.. మొత్తం ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Sometimes Miracles are Just Good People with Kind Hearts.❤️ pic.twitter.com/iIncjYBQIi
— Awanish Sharan (@AwanishSharan) June 3, 2022
ఇవి కూడా చదవండి : Swiggy Boy: వైరల్ వీడియో: ట్రాఫిక్ పోలీస్ ఓవరాక్షన్.. అకారణంగా స్విగ్గీ బాయ్‌పై దాడి..