ఇటీవల దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి.. వర్షాలతో పాటు డెంగ్యూ, విష జ్వరాల సీజన్ కూడా మొదలైంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు చోట్ల డెంగ్యూ కేసులు పెరుగుతున్న పరిస్థితి. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా డెంగ్యూ భారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ డెంగ్యూ భారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో పరీక్షలు చేయించుకోగా రిపోర్ట్ లో డెంగ్యూ అని తేలింది. దీంతో ఆయన రెండు వారాల పాటు ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రం టాలీవుడ్, బాలీవుడ్ లో మంచి హిట్ అయ్యింది. తెలుగు లో చిరు, రామ్ చరణ్ లపై అభిమానంతో ఈ చిత్రంలో నటించినట్లు సల్మాన్ ఖాన్ పలు సందర్భాల్లో అన్నారు. సల్మాన్ ఖాన్ డెంగ్యూ భారిన పడటంతో ఆయన నటిస్తున్న చిత్రాల షూటింగ్స్ వాయిదా పడ్డాయి. ప్రస్తుతం సల్మాన్ ‘కిసీకా భాయ్-కిసీకా జాన్’ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం 2023 లో ఈద్ సందర్భంగా థియేటర్లోకి రానుంది.
బాలీవుడ్ లో బిగ్ బాస్ కి హూస్ట్ గా వ్యవహరిస్తున్నారను సల్మాన్ ఖాన్. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ – 16 నడుస్తుంది. సల్మాన్ ఖాన్ అనారోగ్య పరిస్థితి వల్ల ఆయన స్థానంలో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హూస్ట్ గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. గతంలో కరణ్ జోహార్ ఓటీటీలో వచ్చిన బిగ్ బాస్ కి హూస్ట్ గా వ్యవహరించారు. ఇక సల్మాన్ ఖాన్ అనారోగ్యం భారిన పడ్డారన్న విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకొని రావాలని దేవున్ని ప్రార్థిస్తున్నారు.