తెలంగాణలో ఇప్పుడు పేపర్ లీకేజ్ వ్యవహారాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎంతో కష్టపడి చదివే విద్యార్థులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. నిన్న తాండూర్ లో టెన్త్ తెలుగు పేపర్ లీక్.. ఈ రోజు వరంగల్ లో హిందీ పేపర్ లీక్.. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని అధికార పక్షాన్ని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.
తెలంగాణలో ఇప్పుడు పేపర్ లీకేజ్ వ్యవహారాలు కలకం రేపుతున్నాయి. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ దుమారం కొనసాగుతున్న సమయంలోనే నిన్న వికారాబాద్ తాండూర్ టెన్త్ తెలుగు పరీక్ష పత్రం లీక్ కాగా, నేడు వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీక్ కావడంతో అసలు తెలంగాణలో ఏం జరుగుతుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికార పార్టీపై ప్రతిపక్ష నేతలు టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా లెన్త్ హిందీ పరీక్ష పేపర్ కాపీయింగ్ వ్యవహరంలో మైనర్ తో పాటు మరో ఇద్దరు నిందితులను కమలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో ఓ మైనర్ తో పాటు శివ గణేష్, బూరం ప్రశాంత్ లు గా గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ గందరగోళం నడుస్తున్న సమయంలోనే పదో తరగతి ప్రశ్నా పత్రాలు వరుసగా లీక్ కావడంతో కలకలం రేగింది. నిన్న తాండూర్, నేడు వరంగల్ లో పేపర్ లీక్ అయిన ఘటన చోటుచేసుకుంది. దీనిపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోనున్నట్లు ప్రకటించింది. కాగా, ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో మైనర్ తో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ విషయం పై రంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ మాట్లాడుతూ.. నింధితుల్లో ఒకడైన మైనర్ ఉప్పల్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్ష రాస్తున్న తన మిత్రుడికి పరీక్షలో సహాయం చేయడం కోసం హిందీ పరీక్ష జరుగుతన్న సమయంలో కమలాపూర్ పోటీస్ స్టేషన్ పరిధిలోని బాలుర ప్రభుత్వ పాఠశాల వెనుక గోడ దూకి ప్రహారీ కిటికీ వద్దకు వచ్చి పరీక్ష రాస్తున్న బాలుడి నుంచి 9.45 నిమిషాలకు హిందీ పరిక్ష పేపర్ ని తీసుకున్నాడు. దాని సెల్ లో ఫోటో కొట్టి అనంతరం మరో నింధితుడైన మౌటం శి గణేష్ కి వాట్సాప్ ద్వారా పంపాడు.
ఆ తర్వతా మౌటం శి గణేష్ ఉదయం 9.59 నిమిషాలకు తన సెల్ ద్వారా ఎస్.ఎస్.సీ. 2019-20 అనే వాట్సాప్ గ్రూప్ కి ఫార్వర్డ్ చేశాడు. దీంతో ఆ ప్రాంతంతో పలువురి వాట్సాప్ గ్రూపు లో పరీక్షా పత్రి చక్కర్లు కొట్టడంతో విద్యాశాఖ అధికారలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా పోలీస్ మమిషనర్ ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు వేగంగా పూర్తి చేశారు. ఈ క్రమంలో నింధితులను గుర్తించిన పోలీసులను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు. ఇకపై పేపర్ లీకేజ్ లాంటి వాటికి పాల్పపడితే ఎలాంటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఏ.వి. రంగనాథ్ .