సెలబ్రిటీలు మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు రోజంతా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతుంటారు. నిత్యం ప్రజల్లో తిరిగాల్సిందే. ఏమాత్రం వెనకబడినా.. ప్రజా క్షేత్రానికి కొన్ని రోజులు దూరంగా వెళ్లినా.. పరిస్థితులు తారుమారవుతాయి. అందుకే కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని పక్కకు పెట్టి మరీ ప్రజల్లో తిరుగుతుంటారు. ఇక కుటుంబ సభ్యులే వారిని అర్థం చేసుకుని.. అడ్జెస్ట్ అవుతుంటారు. ఇక సెలబ్రిటీల వ్యక్తిగత జీవిత విశేషాలు.. మరీ ముఖ్యంగా లవ్ స్టోరీ, మ్యారేజ్ వంటి విషయాల గురించి తెలుసుకోవడానికి అభిమానులతో పాటు సామాన్యులు చూడా ఆసక్తి కనబరుస్తారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన లైఫ్‌లోని లవ్ ట్రాక్ గురించి అభిమానులకు తెలిపారు.
ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని మహిళా జూనియర్ కాలేజీలో సందడి చేశారు. విద్యార్థినులతో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు జగ్గారెడ్డి. ఈ సందర్భంగా తన లవ్‌స్టోరీని వెల్లడించారు. తాను టీనేజీలో ఉండగానే లవ్‌లో పడ్డానని తెలిపారు. ఇక తన అవతారం చూస్తే కనీసం పదో తరగతి అయినా పాస్ అయ్యానా లేదా అని తనని అనుమానిస్తారని జోక్ చేశారు.
‘‘నేను ఇంటర్లో ఫెయిల్ అయ్యాను. అందుకే నా క్వాలిఫికేషన్ ఏంటని అడిగితే.. పదో తరగతి అని చెబుతాను. పదహారేళ్లకే ఇంటర్ మధ్యలో ఆపేసి రాజకీయాల్లోకి వచ్చాను. 19 ఏళ్ల వయసులో మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికయ్యాను. ఇక 31 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఎమ్మెల్యేగా విజయం సాధించాను. ఇక నేను పదో తరగతిలోనే ఓ అమ్మాయిని ప్రేమించాను. ఆమె కూడా ఓకే చెప్పింది. ఇప్పుడు తన మీ మధ్యే ఉందంటూ..’’ తన భార్యను విద్యార్థినులకు పరిచయం చేశాడు జగ్గారెడ్డి. తామిద్దరూ పదో తరగతిలోనే లవ్‌లో పడ్డామని.. పెళ్లి చేసుకుని ఒక్కటయ్యామని చెప్పుకొచ్చాడు జగ్గారెడ్డి. ఆయన మాటలు విన్న అభిమానులు, విద్యార్థినులు ఈలలు వేస్తూ.. గోల చేశారు. ఆ సమయంలో జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి కూడా పక్కనే ఉన్నారు. తండ్రి మాటలు విన్న ఆమె నవ్వుతూ ఉండిపోయారు.
జగ్గారెడ్డి తన భార్య నిర్మలను విద్యార్థినులకు పరిచయం చేశాడు. అనంతరం ఆమె గురించి మాట్లాడుతూ.. ‘‘నేను టీనేజ్‌లో ఉండగానే తనను చూసి ప్రేమించాను. ఆమె కూడా అంగీకరించింది. ఇక తను ఇంటర్లో బైపీసీ, డిగ్రీలో బీకామ్ చదివింది. ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చింది. కానీ రాజీనామా చేపించి నాతో తీసుకువచ్చాను’’ అని చెప్పుకొచ్చారు. జగ్గారెడ్డి మాటలు విన్న అభిమానులు.. అన్న మాస్ అనుకున్నాం.. కానీ లవ్ స్టోరీతో క్లాస్ టచ్ ఇచ్చాడు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.