దేవుళ్ల పేరు చెప్పుకుని కొంత మంది స్వామిజీలు, స్వయం ప్రకటిత బాబాలు నీచపు పనులకు ఒడిగడుతున్నారు. మీ ఇళ్లు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఇంట్లో శాంతి పూజలు జరిపించాలని కహానీలు చెబుతూ అమ్మాయిల్ని, మహిళల్ని లోబర్చుకుంటున్నారు
దేవుళ్ల పేరు చెప్పుకుని కొంత మంది స్వామిజీలు, స్వయం ప్రకటిత బాబాలు నీచపు పనులకు ఒడిగడుతున్నారు. మీరు సుఖ సంతోషాలతో ఉండాలంటే, ఆర్థికంగా స్థిరపడాలంటే.. అనుకున్నది పొందాలంటే ఇంట్లో శాంతి పూజలు జరిపించాలని, ఒంటికి పట్టిన దెయ్యం వదిలించాలంటే క్షుద్ర పూజలు చేయాలని కహానీలు చెబుతూ అమ్మాయిల్ని, మహిళల్ని లోబర్చుకుంటున్నారు. నీతి వ్యాఖ్యాలు వల్లిస్తూ ఆడపిల్లలను తమ ఉచ్చులోకి లాక్కుంటున్నారు. మహిళల జీవితాలతో ఆడుకున్నాక వీరి అసలు స్వరూపం బయటపడుతుంది. గతంలో దొంగ బాబాలు, దొంగ స్వామీజీల గుట్టు రట్టయిన సంగతి విదితమే. ఇప్పుడు పాస్టర్లు కూడా ఈ దారిలో నడుస్తున్నారు. కొంత మంది పాస్టర్లు కూడా ఆడ పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. వారితో శారీరక సంబంధాలు పెట్టుకుంటున్నారు.
ఓ యువతితో పాస్టర్ అయిన భర్త వివాహేతర సంబంధం పెట్టుకోగా.. భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. దీంతో అతడి భార్య.. సదరు యువతిపై నడి రోడ్డుపై దేహ శుద్ధి చేసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిన్నారం మండలం బొల్లారంలో జయరాజ్ అనే వ్యక్తి పాస్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. బోధనలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి దగ్గరకు బోధనలు వినేందుకు వచ్చిన ఓ యువతితో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఆమెతో సరససల్లాపాల్లో ఉండగా.. జయరాజ్ భార్య పట్టుకుంది. వెంటనే యువతిని రోడ్డుపైకి తీసుకువచ్చి దేహ శుద్ధి చేశారు. ఇష్టమొచ్చినట్లు కొట్టారు. ఆమెకు నడి రోడ్డుపై జుట్టు పట్టుకుని తన్నారు.