విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పై కాంగ్రెస్ సీనియర్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియా మాట్లాడుతున్న సమయంలో రాహుల్ గాంధీపై ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ ను ప్రస్తావించగా.. కోపంతో ఊగిపోయారు. సినిమాలు లేక ప్రకాశ్ రాజ్ ఫేడ్ అవుట్ అయిపోయాడంటూ కామెంట్ చేశారు. సినిమా వాళ్లకి ఇదో తమాషా అయిపోయిందంటూ ఎద్దేవా చేశారు. తేలిగ్గా రాజ్యసభ సీటు ఎక్కడ వస్తుందో ప్రకాశ్ అక్కడి చేరాంటూ చురకలు అంటించారు. రాహుల్ గాంధీ కాలి గోటికి కూడా సరిపోడు ప్రకాశ్ రాజ్ అంటూ జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ గురించి ఏం తెలుసని ప్రకాశ్ రాజ్ పొడుగుతున్నాడంటూ ప్రశ్నించారు. ఇదే ప్రకాశ్ రాజ్ మల్లీ కేసీఆర్ ను తిట్టే రోజు కూడా వస్తుందని వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: పుష్ప-2 కోసం ఊహలకి కూడా అందని మాస్టర్ ప్లాన్! రాహుల్ గాంధీ సభ గురించి కూడా జగ్గారెడ్డి మాట్లాడారు.. ‘రాహుల్ గాంధీ వరంగల్ సభ గురించి ప్రజల్లోకి వెళ్లకూడదనే ఉద్దేశంతో ఫస్ట్ పేజీల్లో అన్ని పేపర్లకు యాడ్స్ ఇచ్చారు. ఇదంతా టీఆర్ఎస్ చేతకాని తనానికి నిదర్శనం. ఢిల్లీ నుంచి స్క్రిప్ట్ వస్తే బండి సంజయ్ ఇక్కడ చదువుతాడు. రేపటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై యుద్ధమే. రాహుల్ ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చాక నెరవేరుస్తాం. రాహుల్ గాంధీ మెసేజ్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తాం. ప్రస్తుతం జై తెలంగాణ కాదు.. జై రైతు అనాలి’ అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రకాశ్ రాజ్, టీఆర్ఎస్ పై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.