నగరాలు, పట్టణాల్లో ఇంటర్నెట్ సేవలు బాగానే ఉంటాయి. కానీ, పల్లెటూర్లు, మన్యం, మారుమూల ప్రాంతాల్లో మాత్రం ఇంటర్నెట్ సేవలు ఉండే అవకాశాలు చాలా తక్కువ. అయితే ఇప్పుడు చాలా కంపెనీలు శాటిలైట్ ఇంటర్నెట్ పై పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ జాబితాలోకి భారతదేశ వ్యాపార వేత్త సునీల్ మిట్టల్ కూడా చేరారు.
ఇంటర్నెట్.. ఇప్పుడు ఇది లేకపోతే చాలా పనులు జరగవనే చెప్పాలి. సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి, మానవ జీవితాన్ని సులభతరం చేసుకునేందుకు ఈ ఇంటర్నెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అసలు ఇంటర్నెట్ అంటే తెలియని గ్రామాలు, ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అయితే అక్కడకు ఇంటర్నెట్ సేవలు అందించేందుకు చాలా అవరోధాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ టవర్లు నిర్మించేందుకు వీలు లేకపోవడం, కేబుల్స్ వేసేందుకు ఆస్కారం లేకపోవడం ఉంటుంది. అయితే ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ స్టార్ లింక్ ద్వారా మాత్రం మారుమూల ప్రాంతానికి కూడా ఇంటర్నెట్ ఇవ్వచ్చు.
ఎందుకంటే అది శాటిలైట్ ద్వారా పనిచేస్తుంది. ఇప్పుడు ఇదే బిజినెస్ లోకి ఎలన్ మస్క్ కి పోటీగా భారతదేశ ప్రముఖ వ్యాపార వేత్త సునీల్ మిట్టల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన ఇప్పటికే 15 దేశాల్లో సేవలు అందిస్తుండగా.. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఆయన ఇటీవలే ఒక కంపెనీలో షేర్స్ కొనుగోలు చేశారు. లండన్ కు చెందిన వన్ వెబ్ అనే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించే సంస్థ దివాళా తీసింది. ఈ కంపెనీలో సునీల్ మిట్టల్ 38.6 శాతం వాటాలు కొనుగోలు చేశారు. అలాగే యూకే ప్రభుత్వం 19 శాతం వాటాలు కొనుగోలు చేసింది.
OneWeb and Airtel is likely to launch it’s High speed Satellite Broadband service in India by July. 😍
Get more updates only on @technosports_in#airtelnetwork #mumbai #shotononeplus #recharge #bsnl #trai #sunilmittal #airtelinternet #investment #stockmarkets #sha pic.twitter.com/LoV07u3xYD
— TechnoSports (@TechnoSports_in) March 27, 2023
ఇప్పుడు ఈ కంపెనీని వేగంగా అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించడమే తమ లక్ష్యమని సునీల్ మిట్టల్ వెల్లడించారు. మొత్తం రెండు దశల్లో ఉపగ్రహాలను ప్రయోగించాలని అనుకున్నారు. మొదటి దశలో 618 ఉగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టారు. అందులో భాగంగాగనే ఆదివారం ఇస్రో చేసిన ప్రయోగంలో వన్ వెబ్ కి చెందిన 36 ఉపగ్రహాలను ఆర్బిట్ లో ప్రవేశపెట్టారు. రెండో దశలో దాదాపు 1900 ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు చెప్పారు. వీటిని భూమికి 1200 కిలోమీటర్ల దూరంలోనే ప్లేస్ చేస్తున్నారు. తద్వారా ఇంటర్నెట్ సిగ్నల్ రిసీవింగ్ కి చాలా తక్కువ సమయం పడుతుందని చెబుతున్నారు. ఈ సిగ్నల్స్ రిసీవ్ చేసుకునేందుకు ఒక ఆంటెనాను అందిస్తారు. దాని ద్వారా మీకు ఇంటర్నెట్ వస్తుంది.
స్టార్ లింక్ 500 డాలర్లకు ఆంటెనా, నెలకు 99 డాలర్ల వరకు సబ్ స్క్రిప్షన్ వసూలు చేస్తోంది. అయితే వన్ వెబ్ టారిఫ్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుందని సునీల్ భారతీ మిట్టల్ వెల్లడించారు. అయితే ఒక ఆంటెనా ద్వారా 30 నుంచి 40 కుటుంబాలు ఇంటర్నెట్ పొందవచ్చు. కాబట్టి అందరి మీద కలిసి ఈ పరికరాన్ని కొనుగోలు చేసుకుంటే తక్కువకే ఇంటర్నెట్ సేవలను పొందవచ్చని వెల్లడించారు. వన్ వెబ్ కచ్చితంగా స్టార్ లింక్ కంటే బెటర్ అని సునీల్ మిట్టల్ ధీమా వ్యక్తం చేశారు. ఎందుకంటే స్టార్ లింక్ కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం కానుండగా.. వన్ వెబ్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అందించగలదని వెల్లడించారు.
Sunil Mittal said that India has a big role to play in launch of OneWeb’s services globally. He said that OneWeb will be a competition for Elon Musk-owned Starlink. The conglomerate said that OneWeb has become the only global operator leaving Starlink behind. pic.twitter.com/1XBsQ6vAZ2
— Eagle Eye (@SortedEagle) March 27, 2023