వినోదం లో విప్లవం టెలివిజన్. సాధారణంగా విప్లవం అనే దానికి కొంత పరిమితి ఉంటుంది. కానీ ఈ వినోద విప్లవానికి మాత్రం పరిమితి లేదు. కాలంతో పాటు ఈ విప్లవమూ పరుగులు తీస్తూనే ఉంది. వీధి నాటకాలే వినోదం అనే స్థాయి నుంచి సినిమాగా.. టెలివిజన్ గా రూపాంతరం చెందింది. ప్రస్తుతం టెలివిజన్ ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అందులోనూ టెక్నాలజీ పెరిగాక ప్రజలు కూడా టీవీలను వదిలేసి స్మార్ట్ టీవీల వైపు పరుగులు పెడుతున్నారు.
ధనిక, పేద అనే తేడా లేకుండా వినోదాన్ని పంచే టీవీలకు అధిక ధర ఉండటం సహజం. ప్రస్తుతం మార్కెట్ లో ఏ టీవీ ధర చూసుకున్నా… కనీసం రూ.15 వేలకు పైగానే వెచ్చించాల్సి వస్తోంది. అందులోనూ స్మార్ట్ టీవీ కావాలంటే రూ.20 వేలు ఖర్చు పెట్టక తప్పదు.పేద, మధ్యతరగతి ప్రజలకు ఇంత మొత్తంలో ఒకేసారి చెల్లించాలి అంటే చాలా కష్టమే. అందుకే తాజాగా అమెజాన్ ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ పేరిట జరుగుతున్న ఈ సేల్ లో 43 అంగుళాల స్మార్ట్ టీవీని రూ.18,999 ధరకే అందిస్తోంది.
అమెజాన్ బేసిక్స్ బ్రాండ్‌కు చెందిన స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 44,000 కాగా అఫర్ లో భాగంగా 53% డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఈ టీవీ రూ. 23,501 తగ్గింపుతో రూ. 20,499లకు అందుబాటులో ఉంది. కొనుగోలు చేసే సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ఉపయోగించినట్లయితే రూ. 1500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో రూ.18,999లకే ఈ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు.
అమెజాన్ బేసిక్స్ 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్స్
ఇది కూడా చదవండి: Smart Tv: రూ.30 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీల వివరాలు!
ఇది కూడా చదవండి: OnePlus: మీ పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే.. సగం ధరకే OnePlus స్మార్ట్‌ఫోన్