గత ఏడాది జూలై 23న అంగారక గ్రహంపై పరిశోధనల కోసం చైనా జాతీయ అంతరిక్ష సంస్థ (సీఎన్ఎస్ఏ) తియాన్వెన్ 1 ప్రయోగాన్ని చేపట్టింది. విజయవంతంగా వ్యోమనౌక (రోవర్ )ను పంపించింది. ఈ ఏడాది మే నాటికి అరుణ గ్రహంపైన దానిని దిగ్విజయంగా దింపేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి మార్స్ పై కలియతిరుగుతుంది. అంగారక గ్రహం పైన ఉన్న శిలలను తవ్వి పౌడర్‌ను సేకరించినట్లు నాసా పేర్కొంది. గ్రహంపైన ఉన్న దులుత్ అనే శిలను లక్ష్యంగా చేసుకుని రెండు ఇంచు ల మేరకు రోవర్ తవ్వినట్లు నాసా పేర్కొంది. అయితే అక్కడి మట్టి విలువ మాత్రం రూ. కోట్లలో ఉంది.
ఇంకా చెప్పాలంటే ఒక తులం మట్టి విలువ సుమారు రూ. 729.38 కోట్లుగా అంచనా. అంటే మేలిమి బంగారం కంటే సుమారు 1.44 లక్షల రెట్లు ఎక్కువ అన్నమాట. ఇంతకీ ఆ మట్టి ఎక్కడుందనేదే మీ ప్రశ్న కదా? భూమికి దూరంగా అంగారక గ్రహంపైన అంగారకుడిపై జీవరాసుల జాడను కనుగొనేందుకు నాసా ‘పర్సెవరెన్స్ రోవర్’ను పంపిన విషయం తెలిసిందే. అది ఈ ఏడాది ఫిబ్రవరిలో అరుణగ్రహంపైన 49 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన జెజీరో బిలం సమీపంలో దిగింది. ఒకప్పుడు ఆ నది ప్రవహించిన ఆ బిలం పరిసరాల్లోని మట్టిని సేకరించి, జీవరాసుల జాడను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మూడు దశల్లో అక్కడి నుంచి రెండు పౌండ్ల మట్టి నమూనాలను భూమికి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ మట్టి భూమిని చేరడానికి దశాబ్ద కాలం పట్టవచ్చని చెబుతోంది. రెండు పౌండ్ల మట్టిని తీసుకువచ్చేందుకు రూ. 65,643.84 కోట్లు(900 కోట్ల అమెరికా డాలర్లు) ఖర్చు అవుతుంది. అప్పుడు ఆ ఖర్చు అంతా కలిపితే పది గ్రాములు మట్టి ధర సుమారు రూ. 729.38 కోట్లన్నమాట.