సుదీర్ఘ విరామం తర్వాత కొత్త సిరీస్ రాకెట్‌ను ప్రయోగించారు. ఎందరో సైంటిస్టులు కొన్ని నెలల పాటు కష్టపడి దీన్ని తయారు చేశారు. రూ.వందల కోట్లు దీని కోసం వెచ్చించారు. కాని దాన్ని పేల్చేశారు. అసలేం జరిగిందంటే..!
జపాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అంతరిక్ష పరిశోధనల్లో ఆ దేశానికి చేదు అనుభవం ఎదురైంది. దాదాపు 22 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కొత్త రాకెట్ సిరీస్‌ను ప్రయోగించిన జపాన్ అంతరిక్ష ఏజెన్సీకి భారీ ఝలక్ తగిలింది. హెచ్3 రాకెట్ ప్రయోగం ఫెయిల్ కావడంతో ఆ దేశం దాన్ని పేల్చేసింది. మంగళవారం తనగాషిమా స్పేస్ సెంటర్ నుంచి ఎగిరిన అనంతరం ఆ రాకెట్ రెండో దశలో ఇగ్నిషన్ కాలేదు. మిషన్ విఫలమైందని గ్రహించిన సైంటిస్టులు.. ఆ రాకెట్‌ను పేల్చేశారు. దీంతో జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీకి పెద్ద జట్కా తగిలినట్లయ్యింది. ప్రయోగం కోసం ఖర్చు చేసిన రూ.వందల కోట్లతో పాటు కొన్ని నెలల పాటు రాత్రింబవళ్లు శ్రమించిన సైంటిస్టుల శ్రమ బూడిదపాలయ్యాయి.
అతి తక్కువ ఖర్చుతో హెచ్3 రాకెట్‌ను జపాన్ అభివృద్ధి చేసింది. విపత్తు స్పందన కోసం అలాగే డేటా సేకరణకు ఈ ఉపగ్రహం ఎంతగానో దోహదపడుతుంది. ఈ హెచ్3 రాకెట్ ఎత్తు 57 మీటర్లు. సౌత్ జపాన్‌లోని తనగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని నింగిలోకి ప్రయోగించారు. నిజానికి గత నెలలోనే ఈ ప్రయోగం జరగాల్సింది. అయితే అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. నింగిలోకి ఎగిరిన తర్వాత సెకండ్ స్టేజ్ ఇంజిన్ ఫెయిల్ అవడంతో, రాకెట్లో ఇగ్నిషన్ కాలేదు. దీంతో మిషన్ ఆఫీసర్స్ మాన్యువల్‌గా ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు. డిస్ట్రిక్ కమాండ్‌తో దాన్ని పేల్చేశారు. అసలు ఎందుకిలా జరిగిందనేది డేటాను పరిశీలించిన తర్వాత చెబుతామన్నారు.
LAUNCH! Maiden flight of the Japanese H3 rocket.
Overview: https://t.co/iYcuB1lzIT
JAXA Livestream: https://t.co/7D2Ia6geyo pic.twitter.com/k2I0rILZmR
— Chris Bergin – NSF (@NASASpaceflight) March 7, 2023