రాబోయే రోజుల్లో దేశంలో హైడ్రోజన్ ఆధారిత ఇంధనంతో నడువనున్నాయి. కార్ల విషయంలో బ్యాటరీలతో జరిగిన పోరులో హైడ్రోజన్ ఓడిపోయింది. కానీ, రవాణా, పరిశ్రమలు, హీటింగ్ వంటి ప్రక్రియల అవసరాలను బ్యాటరీలు తీర్చలేకపోతున్నాయి. అందుకే, ఇప్పుడు మళ్లీ హైడ్రోజన్ పోటీలోకి వచ్చింది. ఫ్యూయెల్ సెల్‌లో హైడ్రోజెన్ గాలిలో ఉండే ఆక్సిజన్‌తో రసాయనిక చర్య జరుపుతుంది. ఈ రసాయనిక శక్తి విద్యుత్‌గా మారుతుంది. దానితోనే యంత్రాలు నడుస్తాయి. ఈ ప్రక్రియంలో నీరు విడుదల అవుతుంది. పర్యావరణానికి హాని కలిగించేవేవీ పుట్టవు.
హైడ్రోజన్ ఇంధనంతో నడిచే కార్లు, ట్రక్కులు, పడవలు, వ్యాన్లు, డబుల్ డెకర్ బస్సులు, చిన్నపాటి విమానాలు ఇదివరకు రూపొందాయి. తాజాగా జేసీబీ సంస్థ ఓ ఎక్స్‌కవేటర్‌ను ఫ్యూయెల్ సెల్‌తో తయారుచేసింది. 2030 నాటికి హైడ్రోజన్ ఇంధనం ఆధారిత సాంకేతికతతో రైళ్లను నడుపనున్నట్లు ఏజీడీ పీఆర్‌ఓ రాజీవ్ జైన్ తెలిపారు. త్వరలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా హర్యానా జింద్ – సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల ట్రాక్‌పై నడిచే డెము (DEMU) రైళ్లలో రీట్రోఫిటింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు ఈ నెల 17న ప్రీ బిడ్ కాన్ఫరెన్స్ జరుగుతుందని, ప్రక్రియ అక్టోబర్ 5 వరకు ముగుస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
హైడ్రోజన్ ఇంధనం పరిశుభ్రమైందని రైల్వే ఎనర్జీ మేనేజ్‌మెంట్ కంపెనీ సీఈఓ ఎస్‌కే సక్సేనా తెలిపారు. రైల్వేలు ప్రారంభమై నిన్న మొన్నటి వరకూ బొగ్గు ద్వారానే రైళ్లు పరుగులు పెట్టేవి. విద్యుదీకరణ – డీజిల్ ఇంధనంపై పని చేసే రైళ్లను హైడ్రోజన్ ఇంధనంపై నడిచేలా చర్యలు తీసుకోవచ్చని రైల్వేశాఖ భావిస్తున్నది. మొదట్లో ముందుగా రెండు డెమూ ర్యాక్‌లను హైడ్రో ఇంజిన్లుగా మార్చనున్నారు. తర్వాత రెండు హైబ్రిడ్ నారో గేజ్ లోకోమోటివ్‌లను హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్ మూవ్‌మెంట్‌తో రీట్రోఫిట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీని చాలా తక్కువ దేశాలు ఉపయోగిస్తున్నాయి.
జర్మనీ టెక్నాలజీని వినియోగిస్తుండగా పోలాండ్‌లో ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇదివరకు హైడ్రోజన్ ట్యాంకులు పేలొచ్చన్న భయం ఉండేది. కెవ్లర్ సింథటిక్ ఫైబర్ పూత పూసిన ట్యాంకులు, ట్యాంకు మూసుకుపోతే హైడ్రోజెన్ విడుదల చేసేందుకు అందుబాటులోకి వచ్చిన ప్రక్రియలు దీనికి పరిష్కారాన్ని చూపాయి. ఒక్కో రైలుకు ఏటా 2 కోట్ల 30లక్షల విలువైన ఇంధనం ఆదా అవుతుందట. కర్బన ఉద్గారాలు ఏటా 11.12 కిలో టన్నుల నుంచి 0.72 కిలో టన్నులకు తగ్గి ఆ మేరకు కాలుష్యం తగ్గుతుంది.