ప్రస్తుతం అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవి చాలదన్నట్లు వంట గ్యాస్ ధరలు కూడా పెరిగి సామాన్యుడికి గుదిబండలుగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో ఓ స్టవ్ మార్కెట్ లోకి రానుంది. గ్యాస్, కరెంట్ అవసరం లేకుండానే ఈ స్టవ్ ను వినియోగించుకోవచ్చు.
వంటింట్లో ఎన్నో రకాల ఉపకరణాలను ఉపయోగిస్తూ ఉంటారు. వాటిలో గ్యాడ్జెట్స్ కూడా ప్రధానంగా ఉంటాయి. కానీ, అన్నింటి కంటే ప్రధానంగా ఉపయోగించేది, ఎక్కువ మంది కొనుగోలు చేసే వస్తువు మాత్రం గ్యాస్ స్టవ్ అనే చెప్పాలి. వెనుకటి రోజుల్లో అయితే స్టెయిన్ సెల్ స్టీల్ గ్యాస్ స్టవ్స్ బాగా వాడేవారు. కానీ, ఇప్పుడు మాత్రం గ్లాస్ టాప్ స్టౌవ్స్ ని వినియోగిస్తున్నారు. వాటిలో కూడా 3 బర్నల్స్, 4 బర్నల్స్ స్టౌవ్స్ నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. […]
Gas: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తరుచూ గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుతో అల్లాడుతున్న వారిపై మరో పెను భారం పడింది. ఇవాల్టి నుంచి గ్యాస్ కనెక్షన్‌కు సంబంధించి వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ఆయిల్ కంపెనీలు.. గ్యాస్ కనెక్షన్ తీసుకునే సమయంలో చెల్లించాల్సిన రిఫండబుల్ డిపాజిట్ మొత్తాన్ని పెంచేసిన సంగతి తెలిసిందే. ఈ పెరిగిన ధరలు ఈ రోజునుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో పెరిగిన ధరల ప్రకారం 14.2 కేజీల సిలిండర్ కనెక్షన్ […]
దేశ ప్రజలకు కేంద్రం తీపి కబురు అందించింది. ప్రజలకు పెనుభారంగా మారిన వంట గ్యాస్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారులు వాడే డొమెస్టిక్ సిలిండర్ల ధరలను కేంద్రం రూ.200 తగ్గించింది. పీఎం ఉజ్వల యోజన కింద కనెక్షన్ తీసుకున్నవారికి రూ.200 సబ్సిడీ అనేది ఏడాదికి 12 సిలిండర్లకు వర్తిస్తుంది. ఈ తగ్గింపుతో 9 కోట్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ తగ్గింపుతో ప్రస్తుతం హైదరాబాద్ లో రూ.1003గా ఉన్న డొమెస్టిక్ సిలిండర్ ధర […]
కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ కారణంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా ధరల పెరుగుదలతో సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా మరో సంక్షోభం సామాన్యుడిపై ప్రభావం చూపనుంది. ఉక్రెయిన్ సంక్షోభం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. తూర్పు ఉక్రెయిన్ లోని లుహాన్క్స్ , దోనెట్క్స్ రెండు ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన చేశారు. అంతటితో ఆగకుండా ఒక రోజు గడువులో ఏకంగా ఉక్రెయిన్ లోని డోన్ బాస్ ప్రాంతంపై మిలిటరీ దాడులు చేపట్టాలని […]
రాబోయే రోజుల్లో దేశంలో హైడ్రోజన్ ఆధారిత ఇంధనంతో నడువనున్నాయి. కార్ల విషయంలో బ్యాటరీలతో జరిగిన పోరులో హైడ్రోజన్ ఓడిపోయింది. కానీ, రవాణా, పరిశ్రమలు, హీటింగ్ వంటి ప్రక్రియల అవసరాలను బ్యాటరీలు తీర్చలేకపోతున్నాయి. అందుకే, ఇప్పుడు మళ్లీ హైడ్రోజన్ పోటీలోకి వచ్చింది. ఫ్యూయెల్ సెల్‌లో హైడ్రోజెన్ గాలిలో ఉండే ఆక్సిజన్‌తో రసాయనిక చర్య జరుపుతుంది. ఈ రసాయనిక శక్తి విద్యుత్‌గా మారుతుంది. దానితోనే యంత్రాలు నడుస్తాయి. ఈ ప్రక్రియంలో నీరు విడుదల అవుతుంది. పర్యావరణానికి హాని కలిగించేవేవీ పుట్టవు. […]
ఒకప్పుడు ముసుగు వేసుకున్నా… మాస్క్ వేసుకున్నా హడలిచచ్చేవాళ్ళు ఇప్పుడు మాస్క్ వేసుకోకపోతే భయపడిచస్తున్నారు. 500 సంవత్సరాలుగా మాస్కులను ఉపయోగిస్తూనే వస్తున్నారు. ఒకప్పుడు నోటిని, ముక్కును కప్పేలా ఉండే మాస్కులతో బ్యాంకుల దోపిడీ చేసేవారు, ముసుగు మాస్క్ అంటే దొంగలేమో అనుకునే రోజులూ ఉన్నాయి. కానీ ఇప్పుడు కరోనా కాలంలో మాస్క్ ఎంత సాధారణం అయిపోయిందంటే, దానిని ‘నార్మల్’ అని చెప్పుకుంటున్నారు. మాస్క్‌లు ఉపయోగించడం కొత్తగా అనిపించినా అవి మనుషులకు అంత కొత్తేం కాదు. మనిషితో పాటు శతాబ్దాలుగా […]