Gas: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తరుచూ గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుతో అల్లాడుతున్న వారిపై మరో పెను భారం పడింది. ఇవాల్టి నుంచి గ్యాస్ కనెక్షన్‌కు సంబంధించి వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ఆయిల్ కంపెనీలు.. గ్యాస్ కనెక్షన్ తీసుకునే సమయంలో చెల్లించాల్సిన రిఫండబుల్ డిపాజిట్ మొత్తాన్ని పెంచేసిన సంగతి తెలిసిందే. ఈ పెరిగిన ధరలు ఈ రోజునుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో పెరిగిన ధరల ప్రకారం 14.2 కేజీల సిలిండర్ కనెక్షన్ కోసం 2200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఈ ధర 1450 రూపాయలు ఉండేది.
కొత్త ధరలతో 750 రూపాయలు అదనపు భారం పడనుంది. అదే విధంగా 19 కేజీల సిలిండర్ కనెక్షన్ పొందాలంటే ఇప్పుడు 3600 రూపాయలు చెల్లించాలి. ఇంతకు ముందు ఈ ధర 2550 రూపాయలు ఉండేది. పెరిగిన ధరతో 1050 అదనపు భారం పడుతోంది. అయితే, ఈ సెక్యూరిటీ డిపాజిట్ మొత్తం ఎప్పటిలాగే రీఫండబుల్‌గా ఉండనుంది. మరి, అమల్లోకి వచ్చిన కొత్త గ్యాస్ కనెక్షన్ ధరలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Reliance Jio: రిలయన్స్ జియో బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ముఖేశ్ అంబానీ! కొత్త చైర్మన్ గా..