ప్రస్తుతం అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవి చాలదన్నట్లు వంట గ్యాస్ ధరలు కూడా పెరిగి సామాన్యుడికి గుదిబండలుగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో ఓ స్టవ్ మార్కెట్ లోకి రానుంది. గ్యాస్, కరెంట్ అవసరం లేకుండానే ఈ స్టవ్ ను వినియోగించుకోవచ్చు.
ప్రస్తుతం అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవి చాలదన్నట్లు వంట గ్యాస్ ధరలు కూడా పెరిగి సామాన్యుడికి గుదిబండలుగా మారుతున్నాయి. ఈ గ్యాస్ భారం నుంచి తప్పించుకునేందుకు ఇండక్షన్ స్టవ్ లు, ఓవెన్లు వాడటం ప్రారంభిస్తే కరెంట్ ఖర్చవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇలా గ్యాస్,కరెంట్ లను వినియోగించేందుకు సామాన్యుడు భయపడుతున్నాడు. అయితే ఈ రెండిటికి పరిష్కారంగా ఓ స్టవ్ మార్కెట్లోకి రానుంది. ఈ స్టవ్ ను వినియోగించడం వలన గ్యాస్ లేదా కరెంట్ అవసరం లేదు. ఒక్కసారిగా ఈ స్టవ్ కొనుగోలు చేస్తే జీవితాంతం ఇంధనం గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇంతకీ ఆ ప్రత్యేక స్టవ్ ఏంటా? అని ఆలోచిస్తున్నారా? ఇంకేందుకు ఆలస్యం పూర్తి వివరాల్లోకి వెళ్దాం పదండి..
నిత్యావసర ధరలతో సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు. అలానే ఇంధన ధరలు కూడా సామాన్యుడికి కంటి మీద కనుకులేకుండా చేస్తున్నాయి. ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక టెక్నాలజీ రూపొందించింది. ఈ కొత్త సాంకేతిక కలిగిన వస్తువు పేరే.. సూర్య నూతన్ స్టవ్. దీనిని కొనుగోలు చేయడం ద్వారా గ్యాస్ లేదా విద్యుత్ ఖర్చు లేకుండా జీవితకాలం వంట చేసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ స్టవ్ ను విడుదల చేశారు. సోలార్ స్టవ్ ను వంటగదిలో ఉంచి ఉపయోగించవచ్చు. దీనిని 24 గంటలూ ఉపయోగించవచ్చు. ఇది పాత సోలార్ ఓవెన్ లకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ స్టవ్ రెండు యూనిట్లతో తయారు చేయబడింది. ఒక దానిని వంటగదిలో ఏర్పాటు చేస్తారు. మరొక యూనిట్ ఎండలో ఉంచుతారు. ఈ విధంగా ఈ స్టవ్ ను రేయింబవళ్లు ఉపయోగించవచ్చు.
ఇక ఈ నూతన్ సోలార్ స్టవ్ ధరల విషయానికి వస్తే.. ఇవి చాలా అందుబాటులోనే ఉన్నాయి. ఒక వేరియంట్ ధర రూ.12 వేలు కాగా, టాప్ మోడళ్ల ధర రూ.23 వేలకు అందుబాటులో ఉంది. ఐవోసీఎల్ ఈ స్టవ్ ను ప్రస్తుతానికి మార్కెట్లోకి విడుదల చేయలేదు. అయితే త్వరలో మార్కెట్ అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. ఈ స్టవ్ ఇండియన్ ఆయిల్ గ్యాస్ ఏజెన్సీ, పెంట్రోల్ బంకుల వద్ద అందుబాటులోకి ఉంటుందని చెప్పారు. మరి.. గ్యాస్, కరెంట్ అవసరం లేని ఈ కొత్త స్టవ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.