జీవితం అంటేనే సుఖ దుఖాలమయం. జీవన గమనంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొని ముందుకు సాగిపోవాల్సి ఉంటుంది. కానీ కొందరు సమస్యలు వచ్చినప్పుడు వాటికి పరిష్కార మార్గాలు వెతకకుండా నిండు నూరేళ్ల జీవితాన్ని ముగించేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో చాలా చిన్న చిన్న విషయాలకు కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. . పరీక్షలో ఫెయిల్ అయ్యాం అని.. ప్రేమించిన యువతి వదిలేసిందని.. తల్లిదండ్రులు మందలించారని.. అలా ఏదో ఓక ప్రతి విషయానికే అఘాత్యానికి పాల్పడుతున్నారు.. ప్రస్తుతం ఇప్పడు అయితే ప్రతి చిన్న సమస్యకు చావే పరిష్కారం అనుకుంటున్నారు. తొందరపడి నిర్ణయాలు తీసుకొని వాళ్ల జీవితాన్నే నాశనం చేసుకుంటున్నారు.జీవితం చాలా విలువైనది అని తెలుసుకోలేక పోతున్నారు. ఎవరైనా సమస్యలు వస్తే ఎదుర్కోకుండా.. దాన్ని వదిలించుకోవడానికి కొందరు ఆత్మహత్యనే పరిష్కారం అని.. నిండు జీవితాన్ని అర్థాంతరంగా ముగిస్తున్నారు. తాజాగా ఆ కోవకు చెందిన ఘటనే… ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఆ వీడియో ఏంటో తెలుసుకుందామా..ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఒక వ్యక్తి రైల్వే ఫ్లాట్ పామ్ పై నిలబడి ఉన్నాడు. ఎప్పటి లాగానే రైలు కోసం వెయిట్ చేస్తున్నాడు అని మనకు అర్థం అవుతుంది. కానీ అతను రైలు కోసం కాకుండా అతడు చనిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ వ్యక్తి కి చచ్చేంత పరిస్థితి ఏమి వచ్చిందో.. తెలియదు. కానీ.. రైలు కరెక్టు గా వచ్చే సమయానికే.. అతను వెంటనే రైలు పట్టాలపై దూకి.. రైల్వే ట్రాక్ పై తల పెట్టి పడుకున్నాడు. అంతలోనే అదృష్టవశాత్తు అక్కడే ఉన్నా ఒక లేడీ కానిస్టేబులో దృష్టిలో పడింది. ఆ లేడి కానిస్టేబుల్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వెంటనే ట్రాక్ పైకి దూకి ఆ వ్యక్తిని కాపాడి.. అక్కడి నుంచి పక్కకు లాగింది. కానిస్టేబుల్ కు తోడుగా అక్కడే ఉన్న మరో ఇద్దరు కానిస్టేబుల్ కు సహాయం చేసేందుకు ముందుకు రావడం జరిగింది. వారంతా కలిసి ఆ వ్యక్తిని ప్రమాదం నుంచి రక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#RPF Lady Constable K Sumathi fearlessly pulled a person off the track, moments before a speeding train passes by at Purwa Medinipur railway station.
Kudus to her commitment towards #passengersafety.#MissionJeevanRaksha #FearlessProtector pic.twitter.com/yEdrEb48Tg
— RPF INDIA (@RPF_INDIA) June 8, 2023