దేశంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడకం కామన్ అయ్యింది. కొన్ని ముఖ్య పట్టణాల్లో ఫ్రీగా వై ఫైని ప్రొవైడ్ చేస్తుంటారు. దీంతో ఆయా ప్రదేశాల్లో ఉన్నవారు ఉచితంగా వై ఫైని వాడటానికి మొగ్గు చూపుతుంటారు. అదే పనిగా మీరు ఫ్రీగా వై ఫై ని వాడుతున్నట్లయితే ఇబ్బందులు ఎదుర్కొవాల్సిందే. మీ ఫోన్ లో ఉన్న నెట్ వర్క్ ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పపడే అవకాశం ఉందని సైబర్ పోలీసులు అంటున్నారు.
గత కొంత కాలంగా దేశంలో పెద్ద పట్టణాలు అయిన ఢిల్లీ, బెంగుళూరు,ముంబాయి, హైదరాబాద్ లాంటి నగరాల్లో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫ్రీ లేదా పబ్లిక్ వైఫైని ఉపయోగించే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంత మంది సైబర్ నేరగాళ్లు టెక్నాలజీ ఉపయోగించి మొబైల్‌లో సేవ్ చేసిన లాగిన్ వివరాలతో డెబిట్, క్రెడిట్‌కార్డు, ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాల్లోకి చొరబడి నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్‌స్టాండ్‌లు… రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లో వై-ఫై సౌకర్యం కల్పిస్తూ ప్రయాణీకులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 6,100 రైల్వేస్టేషన్లలో ఉచితంగా వై-ఫై సౌకర్యం అందించడం జరుగుతుంది. ప్రతిరోజూ ప్రయాణీకులు ఎక్కువ శాతం ఫ్రీ వై-ఫై ని ఉపయోగిస్తున్నారు. ఫ్రీ వై-ఫై కి కనెక్ట్ కాగానే.. వారి మొబైల్ డాటా మొత్తం వైఫై సర్వర్‌కు చేరిపోతుందని, తద్వారా హ్యాకర్లు మన డేటాను చోరీ చేస్తున్నారు. టెక్నాలజీ ఉపయోగించి మన అకౌంట్స్ లో ఉన్న వేలు, లక్షలు కాజేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.
ఇదంతా చేస్తోంది ఢిల్లీ, ముంబయిలలో ఉంటున్న హ్యాకర్లని పోలీసులు అనుమానిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఫ్రీ వై ఫై ని వాడే సమయంలో జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. వై-ఫై ప్రాంతాలున్న చోట్ల హ్యాకింగ్ బారిన పడకూడదంటే సెల్ ఫోన్ లో ఆటోమేటిక్ కనెక్టివిటీ , బ్లూటూత్‌ను ఖచ్చితంగా ఆపేయాలి. అలా కొంత వరకు మన డేటాను సేవ్ చేసుకోవచ్చని అంటున్నారు పోలీసులు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.