ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. నిరక్ష్యరాసుల నుంచి పెద్ద ఉద్యోగాలు చేసే వారి వరకు అందరూ ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా ఓ సైబర్ కేసు విచారణలో మరో కొత్త ఘరానా మోసం బయట పడింది.
ఒకప్పుడు దొంగతనం అంటే ఇళ్లు, దుకాణాలు, ఇతర భవనాల్లోకి వెళ్లి.. డబ్బులు, ఇతర విలువైన వస్తువులను చోరీ చేసేవారు. అయితే కాలంతో పాటు దొంగలు అప్ డేట్ అయినట్లు ఉన్నారు. పాత పద్ధతులకు చరమగీతం పాడుతూ.. కొత్త పంథాలో చోరీలకు పాల్పడుతున్నారు. అలా అప్ డేట్ అయిన దొంగలనే సైబర్ నేరగాళ్లు అంటున్నారు. నిరక్ష్యరాసుల నుంచి పెద్ద పెద్ద చదువులు చదివిన వారి వరకు అందరు సైబర్ కేటుగాళ్ల బారిన పడి మోసపోతున్నారు. అలానే అమాయకుల గుర్తింపు కార్డులతో అనేక నేరాలకు పాల్పడుతున్నారు. ఓ సైబర్ కేసు విచారిస్తున్న పోలీసులు ఓ ఘరాన మోసం తెలిసింది. ఒక్కే ఆధార్ కార్డుతో ఏకంగా 11 వేల సిమ్ కార్డులు తీసుకున్నారు. ఈ మోసాన్ని చూసి పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక పూర్తి వివరాలోకి వెళ్తే..
గచ్చిబౌలి చెందిన మహేశ్వర్(పేరు మార్చారు) అనే వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్ వేర్ గా పని చేస్తున్నాడు. ఓ రోజు కొత్త నెంబర్ నుంచి మహేశ్వర్ ఫోన్ కి ఓ మెసేజ్ వచ్చింది. కేవైసీ అప్ డేట్ చేసుకోవాలని లేకపోతే మీ బ్యాంకు ఖాతా బ్లాక్ అవుతుందని ఆ మెసేజ్ లో ఉంది. దీంతో నిజమేనని నమ్మి.. ఆ మెసేజ్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి.. అందులో తన బ్యాంకు అకౌంట్ నంబరు, ఇతరత్రా వ్యక్తిగత వివరాలు నమోదు చేశాడు. అంతే ఆ తరువాత క్షణాల్లోనే ఆయన అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా అయినట్లు బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చింది. దీంతో అతడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
బాధితుడి మెసేజ్ వచ్చిన ఫోన్ నంబర్, దాని అనుసంధానించిన గుర్తింపు కార్డును సైబరాబాద్ లోని సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఫర్ సైబర్ సేఫ్టి(సీఓఈసీఎస్)లో విశ్లేషించారు. అందులో ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో నెల రో జుల వ్యవధిలో కేవలం ఒక్క ఆధార్ కార్డు మీద 11వేల సిమ్ కార్డులు జారీ అయినట్లు పోలీసులు గుర్తించారు. సాధారణంగా ఒక్క ఆధార్ కార్డు మీద గరిష్టంగా 9 సిమ్ కార్డులను మాత్రమే జారీ చేయవచ్చు. కానీ ఈ కేసులో మాత్రం థర్డ్ పార్టీ ఏజెన్సీలు డీఓటీ నిబంధనలను ఉల్లంఘించి ఏకంగా 11 వేలసిమ్ కార్డులు జారీ చేసింది. కాగా అందులోని రెండు సిమ్ కార్డుల సైబర్ కేటుగాళ్లు వినియోగించారు.
ఆ ఫోన్ నంబర్ల నుంచే బాధితుడిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిబంధనలను ఉల్లంఘించి సిమ్ కార్డులను జారీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ఓ పోలీస్ ఆఫీసర్ తెలిపారు. మరి.. ఇలా ఒక్క ఆధార్ కార్డు తో వేల సిమ్ కార్డులు తీసుకుంటూ ఎందరో అమాయకులను సైబర్ నేరస్తులు మోసం చేస్తున్నారు. మరి.. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.