నెక్‌బ్యాండ్.. మ్యూజిక్ ప్రియులకు దీని గురుంచి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఒక్క మ్యూజిక్ అనే కాదు.. ఫోన్లు మాట్లాడడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. ఈ నెక్‌బ్యాండ్ టెక్నాలజీ వచ్చాక వైర్డ్ హియర్ ఫోన్స్ కనుమరుగయ్యాయనే చెప్పొచ్చు. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా కార్యాకలాపాలు అందిస్తున్న పీట్రాన్ సంస్థ ‘బ్లూటూత్ నెక్‌బ్యాండ్’ టాంగెంట్ అర్బన్ మోడల్‌ను పరిచయం చేసింది. మే 18 మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ లో సేల్ ప్రారంభం కానుంది. దీని అసలు ధర రూ.799 కాగా లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా రూ.99కే అందిస్తోంది. మరి ఆ ఆఫర్ వివరాలేంటో తెలుసుకుందామా?.
లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా.. మొదటి 100 మంది కస్టమర్లు నెక్‌బ్యాండ్‌ను కేవలం రూ.99కే సొంతం చేసుకోవచ్చు. మే 18 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ లో సేల్ ప్రారంభం కానుంది. మ్యాజిక్ బ్లూ, ఓషియన్ గ్రీన్, ఫేవ్ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉండనుంది. 60 గంటల ప్లేటైమ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ సెగ్మెంట్‌లో ఇదే ఎక్కువ ప్లైటేమ్ కావడం విశేషం. ప్రీమియం డిజైన్‌తో ఈ నెక్‌బ్యాండ్ రానుంది. యాప్ట్‌సెన్స్ గేమింగ్ టెక్నాలజీ ఇందులో అమర్చిన్నట్లు కంపెనీ తెలిపింది. గేమ్స్ ఆడేవారికి ల్యాగ్ లేకుండా రియల్ టైమ్‌లో సౌండ్ వినిపిస్తుంది అన్నమాట. ఇందులో 400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. టైప్‌సీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 600 పైగా పాటలు వినొచ్చని కంపెనీ హామీ ఇస్తోంది. కేవలం 10 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 4 గంటల పాటు ఈ నెక్‌బ్యాండ్ ఉపయోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది.
pTron Tangent Urban Bluetooth Neckband Earphones Coming Soon. More info here: https://t.co/qcSloTw20U#pTron #pTronTangentUrban #Bluetooth #Earphones #Music #newproduct #Comingsoon #dealbates pic.twitter.com/p3w46g6EaK
— dealbates (@dealbates) April 29, 2022
ఇది కూడా చదవండి: రానున్న కొత్త ఆండ్రాయిడ్ ఫోన్లలో అదిరిపోయే ఫీచర్స్!