ఇటీవల ఆర్బీఐ రూ.2 వేల నోట్లు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రజలకు రెండు వేల నోట్లు మార్చే విషయంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నారు.
అప్పట్లో పెద్ద నోట్ల రద్దు సమయంలో దేశంలో బడాబాబులు తప్ప సామాన్యులంతా బ్యాంకుల వద్ద తిండీ తిప్పలు మానేసి పడిగాపులు కాసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుంది.. ఈ మద్య రెండు వేల నోటు రద్దుతో తమ వద్ద ఉన్న రెండు వేల నోటు మార్చుకోవడానికి బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. మార్కెట్ లో రెండు వేల నోటు ఎవరూ తీసుకోకపోవడం లేదు.. అదేదో భూతాన్ని చూసినట్లు చూస్తున్నారు. ఇక తమ వద్ద ఉన్న పెద్ద నోటును వదిలించుకోవడానికి నానా రకాలుగా తిప్పలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో కొంత మంది షాప్ వాళ్లు, పెట్రోల్ బంకులు తమ స్వలాభం చూసుకుంటూనే ఆఫర్లు ఇస్తున్నారు. అలాంటి ఆఫర్ ఓ పెట్రోల్ బంక్ లో ఇవ్వడంతో జనాలు రెండు వేలు మార్చుకోవడానికి క్యూ కడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా రెండు వేల నోటు గురించిన మాటలే నడుస్తున్నాయి. రూ.2 వేల నోటును రద్దు చేస్తూ ఈ మద్య ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మే 23 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ లోగా రెండు వేల నోట్లు బ్యాంకులు, ఆర్బీఐ కార్యాలయాలలో మార్చుకోవాలని సూచించింది. ఒక్కరోజు గరిష్టంగా రూ.20 వేల వరకు ఎక్సేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఆర్బీఐ ప్రకటన తర్వాత మార్కెట్ లో వ్యాపార లావాదేవీలతో పాటు హూటల్స్, మాల్స్, దుకాణాలలో ఎక్కడ కూడా రూ.2 వేల నోటు తీసుకోవడం లేదు. కాకపోతే కొన్ని పెట్రోల్ బంక్స్, షాపులు మాత్రం ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ షరతులు వర్తిస్తాయని అంటున్నారు. తాజాగా ఓ పెట్రోల్ బంక్ రెండు వేల నోటు ఎక్సేంజ్ చేసుకోవడానికి ప్రత్యేక ఆఫర్ తీసుకు వచ్చింది.. కాకపోతే ఓ కండీషన్ కూడా పెట్టింది.
పాతబస్తీలో ఓ పెట్రోల్ బంక్ ఆఫర్ ఇచ్చింది.. పని మానుకొని బ్యాంకుల వద్ద క్యూలైన్లో నిలబడి నానా అవస్థలు పడాల్సిన అవసరం లేకుండా తమ బంక్ లో రూ.2 వేల నోటు మార్చుకోవొచ్చు అని బోర్డ్ పెట్టింది. కాకపోతే కస్టమర్లకు ఒక కండీషన్ పెట్టారు బంక్ యాజమాన్యం. రెండు వేల నోటు మార్చుకోవాలంటే తమ వద్ద రూ.500 పెట్రోల్ పోయించుకోవాలి.. అలా అయితే మిగిలిన చిల్లర ఇస్తామని బోర్డుపై రాసి పెట్టారు. ఈ ఆఫర్ పాతబస్తీ చాంద్రాయణ గుట్టలో నయారా పెట్రోల్ బంక్ కస్టమర్లకు ప్రకటించింది. దీంతో కస్టమర్లు అక్కడికి క్యూ కడుతున్నారు.. ఎలాగూ రూ.500 పెట్రోల్ పోయించుకునేవారు రూ.2 వేల నోటు వదిలించుకునే పనిలో పడ్డారు.