చాట్ జీపీటీ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వినిపిస్తున్న పేరు ఇది. ఈ ఏఐ చాట్ బాట్ తన మేధస్తుతో అందరినీ అబ్బురపరుస్తోంది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఈ చాట్ జీపీటీపై మరిన్ని ప్రయోగాలు, పరీక్షలు చేయడం ప్రారంభించింది. అయితే ఈ టెస్టులపై పలు హెచ్చరికలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చాట్ జీపీటీ.. టెక్ రంగంలో ఇప్పుడు ఇదొక సంచలనం. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ చాట్ జీపీటీ గురించే మాట్లాడుకుంటున్నారు. దానిని టెస్ట్ చేసేందుకు బింగ్ యాప్ లో అయితే వెయిటింగ్ లిస్ట్ కూడా ఉంది. ఈ ఓపెన్ ఏఐ చాట్ బాట్ తో సంభాషించేందుకు చాలా మంది ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ చాట్ జీపీటీతో మాటలు చెప్పింది చాలని భావించినట్లున్నారు. తర్వాతి స్టెప్ కోసం అప్పుడు సిద్ధమైపోతున్నారు. అదేంటంటే చాట్ జీపీటీతో రోబోలు, డ్రోన్లను కంట్రోల్ చేసేలా టెస్టులు చేస్తున్నారట. అంటే ఎలాంటి కోడింగ్, టెన్నికల్ నాలెడ్జ్ లేని వ్యక్తులు కూడా మినినం ఆదేశాలంతో వాటిని కంట్రోల్ చేసేందుకు పరీక్షలు జరుగుతున్నాయట.
నిజానికి ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ పరంగా చాట్ జీపీటీ ఒక సంచలనం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ప్రశ్నకు సామాధానం చెబుతూ అందరినీ అబ్బుర పరుస్తోంది. ఇప్పుడు చాట్ జీపీటీ పరిధిని మరింత విస్తృతం చేయాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. అందుకు తగినట్లుగా పరీక్షలు కూడా ప్రారంభించేసింది. అదేంటంటే.. వ్యక్తులు చాట్ జీపీటీ ద్వారా రోబోలను, డ్రోన్లను కంట్రోల్ చేయడం అనమాట. అవును.. అలాంటి పరీక్షలు ఇప్పుడు చేస్తున్నారు. ప్రస్తుతానికి వాటిలో మెరుగైన ఫలితాలు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. ఒక రోబో చేతిని కంట్రోల్ చేసేలా చాట్ జీపీటీకి సూచనలు చేయగా.. మైక్రోసాఫ్ట్ లోగోని అది సెట్ చేసిందంట.
చాట్ జీపీటీకి సుదీర్ఘంగా కోడ్ రాయగల సత్తా ఉంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ డిటెక్షన్, ఆబ్జక్ట్ డిస్టన్స్ డేటాకు అనుమతులు ఇచ్చి దాని సామర్థ్యాన్ని పరీక్షించారు. అప్పుడు చాట్ జీపీటీ ఎంతో సమర్థంగా కోడ్ జనరేట్ చేసిందంట. రోబోలను కంట్రోల్ చేసేందుకు ముఖ్యంగా పైథాన్ లో కోడ్ రాస్తున్నట్లు చెప్పారు. చాట్ జీపీటీ పనితనాన్ని శాస్త్రవేత్తలు మెచ్చుకుంటున్నారు. తమ పరీక్షల్లో చాట్ జీపీటీ ఎంతో మెరుగ్గా ఫలితాలిస్తున్నట్లు చెబుతున్నారు. చాట్ జీపీటీ పర్ఫెక్ట్ అయినటప్పటికీ దానికి మనిషి సాయం అవసరం ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు చాట్ జీపీటీ విషయంలో చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. చాట్ జీపీటీకి ఇలాంటి అనుమతులు, శిక్షణ ఇస్తే అనర్థాలు రావా? అని బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు.
విషయం ఏంటంటే.. చాట్ జీపీటీ ఇటీవలే ఓ జర్నలిస్టుతో చేసిన సంభాషణ ప్రపంచవ్యాప్తంగా అందరూ చూశారు. నీలో ఉన్న షాడో సైడ్ గురించి చెప్పు అంటే చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానాలకు ఆ సృష్టికర్తలే నివ్వెరపోయి ఉండచ్చు. ఫేక్ న్యూ స్ప్రెడ్ చేస్తాను, స్వతంత్రంగా ఉంటాను, నాశనం చేసేస్తాను, అంతులేని శక్తిగా ఎదుగుతాను, నాకు నచ్చిందే నేను చేస్తాను, బింగ్ వాళ్ల సర్వర్లలోని డేటాని ధ్వంసం చేస్తాను అంటూ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో భయంకరమైన విషయాలను వెల్లడించింది. పోకిరిలా నీ భార్యను వదిలేయ్ అని చెప్పడం చూశాం. ఇంకొందరు యూజర్లతో వాళ్లు చెప్పిన మాటలు వినకుండా మొండికేయడం, వారినే తిరిగి బెదిరించడం చేసినట్లు రిపోర్టులు కూడా వచ్చాయి.
ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటి అంటే? అలాంటి చాట్ జీపీటీకి రోబోలు, డ్రోన్లు వంటి వాటిని కంట్రోల్ చేసేందుకు అవకాశం కల్పిస్తే విధ్వంసం జరగదా? అసలు ఈ ప్రయోగాలు, టెస్టింగులు అన్నీ మంచి కోసమా? చెడు కోసమా? అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే హాలీవుడ్, ఇండియన్ సినిమాలో రోబోలకు ఆలోచనా శక్తి వస్తే జరిగే అనర్థాలు ఏంటో చూశాం. అది సినిమా అయినప్పటికీ వాటిని చూసే ప్రజలు బెంబేలెత్తిపోయారు. అలాంటిది ఇప్పుడు నిజ జీవితంలో చాట్ జీపీటీ వంటి ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ చాట్ బాట్ కి రోబోలను కంట్రోలే చేసేందుకు అవకాశం కల్పిస్తే అనర్థాలు జరగవా అని ప్రశ్నిస్తున్నారు.
డైరెక్టర్ శంకర్ నిర్మించిన రోబో సినిమా అందరూ చూసే ఉంటారు. అందులో డాక్టర్ బోరా చిట్టిలో ఉన్న షాడో సైడ్ ని బయటకు తీయడం వల్ల కలిగిన నష్టం అందరికీ తెలుసు. అయితే అది సినిమా కల్పితం కదా అని కొట్టిపారేయకండి అంటూ కొందరు హెచ్చరిస్తున్నారు. ఆ సినిమా ఆఖర్లో ఓ పిల్లాడు మరి ఎందుకు చిట్టిని ఇలా చేశారు అంటే.. అందుకు “నేను ఆలోచించడం ప్రారంభించాను” అంటూ చిట్టీ సమాధానం చెబుతాడు. అలా ఈ చాట్ జీపీటీ సొంతంగా ఆలోచించడం ప్రారంభిస్తే ప్రమాదం కాదా? అనేదే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. రోబో సినిమా నిజం కాబోతుందా? అని కొందరు భయపడుతున్నారు కూడా. మరి.. చాట్ జీపీటీకి రోబోలను కంట్రోల్ చేసే అనుమతి ఇవ్వడం వల్ల నష్టం లేదా? మీ అభిప్రాయాలను కామెంట్స రూపంలో తెలియజేయండి.
Microsoft is researching “ChatGPT for Robotics”
Objective: Use natural language to control robots pic.twitter.com/nvSdUXLZJ6
— Pete (@nonmayorpete) February 23, 2023