టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ అనేది ఒక పెను సంచలనం అనే చెప్పాలి. ఈ చాట్ జీపీటీ సాయంతో సమాచారాన్ని సేకరించడమే కాదు.. డబ్బు సంపాదన కూడా సాధ్యమని చెబుతున్నారు. అయితే చాట్ జీపీటీ సాయంతో డబ్బు సంపాదిస్తున్న వాళ్లు కూడా లేకపోలేదు.
మనిషి యంత్రంలా పని చేయడానికి ఇష్టపడడు. అందుకే యంత్రాలకు అంత ప్రాధాన్యత. యంత్రాలు వచ్చాక శారీరక పనులు చేసే ఉద్యోగులు బాగా తగ్గిపోయారు. పది మంది మనుషులు చేసే పనులు ఒక యంత్రం చేసేస్తుంది. దీనికి మనిషి పెట్టుకున్న పేరు టెక్నాలజీ. టెక్నాలజీ టెక్నాలజీ ఏం చేస్తావు అంటే మనుషుల కడుపు కొడతాను, వారి ఉద్యోగాలు పోయేలా చేస్తాను, వాళ్ళ బతుకుల్ని రోడ్డు మీద పడేస్తాను అని అన్నదట. కొన్ని టెక్నాలజీలు పెరుగుతున్నాయంటే దానర్థం మనిషి అభివృద్ధి చెందుతున్నాడని కాదు, టెక్నాలజీ మాత్రమే అభివృద్ధి చెందుతుందని. ఉన్న ఉద్యోగాన్ని కోల్పోయేలా చేసి మనిషిని రోడ్డున పడేలా చేస్తుంది టెక్నాలజీ. తాజాగా చాట్ జీపీటీ వల్ల కూడా అనేక మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారని నివేదికలు చెబుతున్నాయి.
టెక్నాలజీ యుగంలో ప్రస్తుతం చాట్ జీపీటీ అనేది సంచలనంగా మారింది. ఎక్కడ చూసినా చాట్ జీపీటీ గురించే చర్చ. ప్రస్తుతం అన్ని టెక్ కంపెనీలు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ చాట్ బాట్ మీదే పెట్టుబడులు, ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే ఈ చాట్ జీపీటీ ద్వారా డబ్బు సంపాదించవచ్చని చెబుతున్నారు.
ప్రస్తుతం చాట్ జీపీటీ గురించి ప్రస్తావన రాని రోజు అంటూ ఉండట్లేదు. ఇప్పటి వరకు చాట్ జీపీటీ కంప్యూటర్, ఫోన్లలో మాత్రమే వచ్చింది. కానీ ప్రముఖ స్మార్ట్ వాచ్ కంపెనీ అమేజ్ ఫిట్ తమ స్మార్ట్ వాచెస్ లో చాట్ జీపీటీని పరిచయం చేస్తోంది.
చాట్ జీపీటీ.. ఈమధ్య కాలంలో బాగా మార్మోగుతున్న పేరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ చాట్‌బాట్ అసాధ్యం అనే పనులను కూడా సులువుగా చేసేస్తోంది. దీని వల్ల భవిష్యత్తులో చాలా జాబ్స్ పోతాయని వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..!
ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించే చర్చ జరుగుతోంది. టెక్ దిగ్గజాలు, కంపెనీలు సైతం అన్నీ ఈ ఏఐ టెక్నాలజీ మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. తాజాగా ఈ కోవలోకి మెటా సంస్థ కూడా చేరింది.
నిన్నటి వరకు చాట్ జీపీటీ వల్ల ఆ అనర్థం ఈ అనర్థం అని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు యూజర్లు ఎక్కువగా ఈ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ చాట్ బాట్ ని వాడటం మొదలు పెట్టిన తర్వాత చాలా వరకు అంతా పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. చాట్ జీపీటీ తమకు ఎంతగానో సహాయం చేస్తోందంటూ చెప్పుకొస్తున్నారు.
చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ సంస్థ కూడా ఏఐ చాట్ గూగుల్ బార్డ్ ని పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏఐ చాట్ బాట్ వల్ల గూగుల్ కి మొదటి నుంచి తలనొప్పులు తప్పడం లేదు. తాజాగా గూగుల్ బార్డ్ తమ సొంత కంపెనీ నిర్ణయంపైనే వ్యతిరేకంగా మాట్లాడి వార్తల్లో నిలిచింది.
చాట్ జీపీటీ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వినిపిస్తున్న పేరు ఇది. ఈ ఏఐ చాట్ బాట్ తన మేధస్తుతో అందరినీ అబ్బురపరుస్తోంది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఈ చాట్ జీపీటీపై మరిన్ని ప్రయోగాలు, పరీక్షలు చేయడం ప్రారంభించింది. అయితే ఈ టెస్టులపై పలు హెచ్చరికలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లేని ఫోన్ ఉండదేమో. అయితే చాలా మంది ఇష్టం లేకుండానే తప్పక చాట్ చేస్తుంటారు. కొందరికి అసలు మెసేజ్ చేయడం కూడా నచ్చదు. అయితే అలాంటి వారికి ఇది శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే త్వరలోనే మీ తరఫున చాట్ జీపీటీ మీ వాట్సాప్ మెసేజ్ లకు రిప్లై ఇస్తుందంట.