ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్. మెటాకు చెందిన ఈ యాప్ తో మెసేజింగ్ దగ్గర నుండి ఫైల్స్ షేరింగ్ తో పాటు ఇటీవల పేమెంట్స్ కూడా చేసుకునే ఫీచర్ వచ్చింది. అయితే.. తాజాగా వాట్సాప్ లో ఏదో సమస్య తలెత్తినట్లు వార్తలొస్తున్నాయి. ఆ సమస్య కారణంగా వాట్సాప్ తరచూ క్రాష్ అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మరి ఈ ప్రాబ్లెమ్ వాట్సాప్ అన్ని వెర్షన్స్ లో తలెత్తిందా.. అంటే కాదని అంటున్నారు. కేవలం వాట్సాప్ బీటా వెర్షన్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ క్రాష్ సమస్య ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం. వాట్సాప్ బీటా యూజర్లు యాప్ ఓపెన్ చేసినప్పుడు లేదా ఏవైనా ఫైల్స్ షేర్ చేసినప్పుడు ఎర్రర్ వస్తున్నట్లు కొందరు యూజర్లు వాట్సాప్ యాజమాన్యానికి తెలిపారు. అయితే.. ఇప్పటివరకు ఈ సమస్యకు కారణం ఏంటనేది తెలియకపోవడం గమనార్హం.
ఈ సమస్యపై స్పందించిన మెటా.. వాట్సాప్ బీటా వెర్షన్ ఆండ్రాయిడ్ యాప్ క్రాష్ అవుతున్నట్లు కంఫర్మ్ చేసింది. అయితే.. సమస్యను నిర్ధారించిన మెటా.. క్రాష్ కు కారణమైన సమస్యకు పరిష్కారాన్ని తెలిపింది. ముఖ్యంగా కొంతమంది బీటా యూజర్లకు యాప్ క్రాష్ సమస్య ఆండ్రాయిడ్ (2.22.4.6), (2.22.4.7) వెర్షన్ల ఫైల్స్ షేర్ చేస్తున్నప్పుడు వస్తుందని క్లారిటీ ఇచ్చింది.
ఈ సమస్యకు పరిష్కారంగా.. వాట్సాప్ బీటా 2.22.4.6, 2.22.4.7 వెర్షన్లను ఉపయోగించే యూజర్లు.. వెంటనే 2.22.4.8 వెర్షన్ కు అప్డేట్ చేయాలని మెటా సూచించింది. యూజర్ల వాట్సాప్ డేటా భద్రంగా ఉంచేందుకు ఆయా యూజర్లు తమ గూగుల్ డ్రైవ్ తో బ్యాకప్ చేసుకోవాలని వాట్సాప్ ట్రాకర్ WABetaInfo తెలిపింది. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.