కేటీఆర్.. కేసీఆర్ కుమారుడిగా మాత్రమే కాకుండా ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. మంత్రిగా ఎంత బాగా స్పీచులు ఇస్తారో.. అవసరమైతే అంతే చమత్కారమూ చేస్తారు. తాజాగా ట్విట్టర్ సీఈవోపై కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
ట్విట్టర్.. గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సోషల్ మీడియా సంస్థ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ట్విట్టర్ ని ఎలన్ మస్క్ కొనుగోలు చేయడం, ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ తొలగించడం, తర్వాత తానే సీఈవోగా మస్క్ బాధ్యతలు తీసుకోవడం, లేఆఫ్స్ ఇలా ప్రతి విషయం టెక్ ప్రపంచంలో పెద్దఎత్తున చర్చకు దారి తీశాయి. తాజాగా ట్విట్టర్ కొత్త సీఈవో నియామకం కూడా అంతే రచ్చకు తెరలేపింది. ఎలన్ మస్క్ తన పెంపుడు కుక్క ఫ్లోకి ఫొటో పెట్టి.. ట్విట్టర్ నూతన సీఈవో అని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ పై భినాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఆ విషయంపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు.
ఎలన్ మస్క్ ఏం చేసినా కూడా అదొక సెన్సేషన్ అవుతుంది. అతను కావాలని కాంట్రవర్సీలు చేస్తారో? ఆయన స్పందిస్తినే కాంట్రవర్సీ అవుతుందో ఇప్పటికీ చాలా మందికి తెలియదు. ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు తీసుకుంటూ.. నా కన్నా క్రేజీ వ్యక్తి ఎవరైనా దొరికితే సీఈవో బాధ్యతలు అప్పగిస్తానంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా ట్విట్టర్ న్యూ సీఈవో అంటూ ఫ్లోకీ ఫొటోని ట్వీట్ చేశారు. ఆ సమయంలో కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ వ్యక్తి కంటే ఫ్లోకీనే ఎంతో బెటర్ అని చెప్పారు. అయితే అది తన గురించి కామెంట్ చేసుకున్నారా? పరాగ్ గురించి ప్రస్తావించారా? అనేది క్లారిటీ లేదు. సీఈవో జాబ్ కి ఫ్లోకీనే కరెక్ట్ అంటూ కామెంట్ చేశారు.
The new CEO of Twitter is amazing pic.twitter.com/yBqWFUDIQH
— Elon Musk (@elonmusk) February 15, 2023
ఇప్పుడు మస్క్ చేసిన ఈ ట్వీట్లపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఒకరకంగా తనదైనశైలిలో సెటైర్లు కూడా వేశారు. కేటీఆర్ తన ట్విట్టర్ హ్యాండిల్ పేరును కేటీఆర్ బీఆర్ఎస్ గా మార్చుకున్నారు. అలా మార్చుకోవడం వల్ల ఆయన బ్లూ బ్యాడ్జ్ అనేది పోయింది. తిరిగి వెరిఫికేషన్ చేసిన తర్వాత మళ్లీ ఆ బ్యాడ్జ్ ను ఇవ్వడం జరుగుతుంది. అయితే అనుకున్న దానికంటే వెరిఫికేషన్ కు వాళ్లు చాలా సమయం తీసుకున్నారు. ఆ విషయంపైనే కేటీఆర్ సెటైర్లు వేశారు. “నా వెరిఫికేషన్ కు ఇంత సమయం తీసుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. న్యూ సీఈవో చూడటానికి చూలా కూల్ గా ఉన్నారు” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. వెరిఫికేషన్ లేట్ అయిన విషయాన్ని చాలా ఫన్నీగా ఎఫెక్టివ్ గా చెప్పారంటూ కేటీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
No wonder it’s taking inordinately long to get my verification badge 😅
The new CEO looks cool 😎 https://t.co/mq2c9H85be
— KTR (@KTRBRS) February 17, 2023