టెక్ దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు జోడిస్తూ యూజర్లకు మరింత చేరువవుతోంది. ఆ అప్డేటెడ్ ఫీచర్లు సైతం యూజర్ల అభిరుచుకి తగ్గట్టుగా ఉండడం విశేషం. ఈ క్రమంలో మరో అద్భుతమైన ఫీచర్ తీసుకొచ్చింది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్‌లో.. గూగుల్ మీటింగ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసేలా తన మీట్ యాప్‌కి కొత్త ఫీచర్‌ను జోడించింది.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని కంపెనీ ఉద్యోగులు ‘గూగుల్ మీట్’ పై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఆన్లైన్ మీటింగ్ ప్లాట్ ఫామ్స్ ఉన్నప్పటికీ దాదాపు అందరు గూగుల్ నే వాడుతున్నారు. ఈ క్రమంలో యూట్యూబ్‌లో మీటింగ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసుకునేలా యూజర్లకు అనుమతించింది. అడ్మిన్.. మీటింగ్ యాక్టివిటీ ప్యానెల్‌కు నావిగేట్ చేయడం, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మీటింగ్‌ను ప్రారంభించొచ్చు. ఈ ఆన్లైన్ సమావేశం కోసం యూజర్స్ ఛానెల్‌ను ఎంచుకోవాల్సి ఉంటుందని ఆండ్రాయిడ్ సెంట్రల్ నివేదించింది.
దీనికోసం చేయవలసిందల్లా ఒక్కటే. యూట్యూబ్‌లో గూగుల్ మీట్ లైవ్ మీటింగ్ కోసం చానల్ అప్రూవ్ అయి ఉండాలి. అప్పుడే లైవ్ స్ట్రీమింగ్ పెట్టుకోవచ్చు. హోస్ట్ మేనేజ్మెంట్ ఆన్‌లో ఉంటే హోస్ట్, కో హోస్ట్‌లు మాత్రమే సమావేశం ప్రత్యక్ష ప్రసారం ప్రారంభించొచ్చు. ఒకవేళ ఈ ఆప్షన్ ఆఫ్‌లో ఉంటే మీటింగ్‌కు హాజరయ్యే ఎవరైనా లైవ్ స్ట్రీమింగ్‌ను ప్రారంభించొచ్చు. ‘ఎవరైనా ఒక విషయాన్ని.. తమ సంస్థ వెలుపల ఎక్కువ మంది ఉద్యోగులకు సమాచారాన్ని అందించాలనుకున్న సందర్భాల్లో లైవ్ స్ట్రీమింగ్ ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా.. పాజ్ చేయడానికి, రీప్లే చేయడానికి లేదా తర్వాత సమయంలో వీక్షించేందుకు వీలు కల్పిస్తుంది’ అని గూగుల్ వివరించింది.
ఇదీ చదవండి: Smartwatch: ఫైర్ బోల్ట్ స్మార్ట్‌వాచ్ పై భారీ తగ్గింపు.. ఏకంగా 13వేలు డిస్కౌంట్..!
ఇదీ చదవండి: Nothing Phone (1): ఇంత హైప్ వచ్చిన నథింగ్ ఫోన్ లో సమస్యలు ఇవే..!