టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన నథింగ్ ఫోన్ (1).. ఎట్టకేలకు భారత మార్కెట్ లోకి రానే వచ్చింది. యూనిక్ డిజైన్, ట్రాన్స్‌ప్రంట్ బ్యాక్ ప్యానెల్, గ్లిఫ్ ఇంటర్ఫేస్, ఎల్ఈడీ స్ట్రిప్ లైట్స్.. వంటి అధునాతన ఫీచర్లతో నథింగ్ ఫోన్ 1 విడుదలైన సంగతి తెలిసిందే. మరి.. ఇన్ని వినూత్నమైన ఫీచర్స్ తో విడుదలైన నథింగ్ ఫోన్.. మొబైల్ ప్రియులను ఆకట్టుకుందా? ఇందులో ఏమైనా సమయస్యలున్నాయా?.. కొన్నవారు ఎలా ఫీలవుతున్నారు.. అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. డెడ్ పిక్సల్స్ నథింగ్ ఫోన్ లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. డిస్ ప్లే ఆన్ అవ్వగానే.. ఫ్రంట్ కెమెరా చుట్టూ డెడ్ పిక్సల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటికే మొబైల్ సొంతం చేసుకున్న కొందరు.. అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తున్నారు. We received the Nothing phone (1) Indian retail unit this morning. And just three hours in, we are seeing dead pixels around the selfie camera in our unit. Disappointing!! Any of you facing any similar hardware issues in #Nothingphone1? pic.twitter.com/2jlsfIFaDB — Beebom (@beebomco) July 15, 2022 వాటర్ మాయిచ్యుర్ నథింగ్ ఫోన్ 1 ప్రధాన ఆకర్షణ.. ట్రాన్స్‌ప్రంట్ బ్యాక్ ప్యానెల్. ఇప్పుడు ఇదే.. దానికి సమస్యగా మారుతోంది. బ్యాక్ ప్యానెల్ లోని కెమెరా మాడ్యూల్ లోకి వాటర్ మాయిచ్యుర్ చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యపై.. నథింగ్ ఇప్పటికే స్పందించింది. కొందరికి రీప్లేస్ మెంట్ కూడా చేసినట్లు తెలుస్తోంది. People facing an issue of water moisture inside camera lens. Even though phone is certified as IP 53. Comment your views. #9droid_ #Nothingphone1 #techy #technology pic.twitter.com/SbWI2QZfa7 — Akshdeep (@9droid_) July 16, 2022 గ్లిఫ్ లైటింగ్ గ్లిఫ్ ఇంటర్ఫేస్‌తో బ్యాక్ ప్యానెల్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. కాల్ వచ్చినప్పుడు, చార్జింగ్ పెట్టినప్పుడు, నోటిఫికేషన్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు బ్యాక్ ప్యానెల్‌పై లైట్స్ బ్లింక్ అయితే చాలా కొత్తగా అనిపిస్తోందట. కాకుంటే.. గ్లిఫ్ లైటింగ్ లో గ్రీన్ టింట్ టిష్యూస్ పేస్ చేస్తున్నారు. స్క్రీన్ లో కూడా ఈ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. It seems the Nothing Phone (1) Glyph LED light strip is peeling on its own inside. Has anyone’s else faced this issue?@nothing #Nothingphone1 pic.twitter.com/mcduPmWMle — Amritanshu Mukherjee (@amritanshu700) July 19, 2022 యుజుడ్ ఫోన్స్ ఇది కూడా నథింగ్ ఫోన్లకు ఒక సమస్యగా మారుతోంది. ఫ్లిప్ కార్ట్ లో బుక్ చేసినవారికి యుజుడ్ ఫోన్స్ వచ్చాయన్నది సమాచారం. బాక్స్ ఓపెన్ చేయగానే.. సెటప్స్ అడగకుండానే.. ఆటోమేటిక్ గా ఫోన్ ఆన్ అవుతోందట. గ్యాలరీ ఓపెన్ చేయగానే ఫొటోస్, వీడియోస్ కూడా ఉంటున్నాయట. pic.twitter.com/xRJmScicjZ — Govardhan Reddy (@gova3555) July 20, 2022 నథింగ్ ఫోన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.