మనిషి ఆలోచనలకు.. ఆవిష్కరణలకు హద్దు లేదు. తక్కువ కాలంలో ఎక్కువ పని చేసేందుకు మొదట యంత్రాల వైపు ద్రుష్టి సారించిన మనిషి.. ఆ తరువాత రోబోల తయారీకి శ్రీకారం చుట్టాడు. అయితే రోబోలు.. మనిషి ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తాయి. అదే మనిషిని.. రోబోలా మారిస్తే ఎలా ఉంటది అన్న ఆలోచన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మదిని తట్టింది. అంతే.. అనుకుందే తడువుగా అటు వైపు దృష్టిపెట్టాడు. మనిషి బుర్రలో ‘చిప్’ పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
ప్రపంచ కుబేరుడిగా, టెస్లా అధినేతగా ఎలాన్ మస్క్ ప్రపంచంలో అతి కొద్ది మందికే తెలుసు. ఎప్పుడైతే ట్విటర్ కొనుగోలు చేశాడో సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచంలోని చివరి మనిషి వరకు ఆయన పేరు తెలిసిపోయింది. మంచో.. చెడో.. నిత్యం వార్తల్లో ఉంటూ మాస్క్ బాగానే పాపులర్ అయ్యారు. ఈ టెస్లా అధినేత మరో సంచలనానికి తెరలేపబోతున్నాడు. మస్క్‌కి సంబంధించిన ‘న్యూరా లింక్’ సంస్థ ‘’బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్’ (బీసీఐ) అనే సాంకేతికతను ఆరు నెలల్లో మానవులపై ప్రయోగించనుందట. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ స్వయంగా ప్రకటించారు. మనిషి మెదడులో పెట్టబోయే చిప్‌తోపాటు.. దాన్ని పుర్రెలో అమర్చగలిగే రోబోని కూడా ఈ సందర్భంగా పరిచయం చేశారు. కాలిఫోర్నియాలోని ప్రిమోంట్‌లో వున్న న్యూరాలింక్ ప్రధాన కార్యక్రమంలో వీటిని ప్రదర్శించారు మస్క్.
Elon Musk’s Neuralink will implant its first person with a chip, to be able to use a computer and phone by thought alone.
This will be revolutionary 👍 pic.twitter.com/lqBtsv3LLU
— Vinay Karwal (@ivinaykarwal) December 1, 2022
పక్షవాతం కారణంగా దెబ్బ తిన్న అవయవాల్ని కదిలించేందుకు.. కంటి చూపు కోల్పోయినవారికి చూపు రప్పించేందుకు.. ఇలా అనేక అనారోగ్య సమస్యలకు ‘చిప్’ సాంకేతికత చెక్ పెట్టనుంది. ఇప్పటికే కోతులపై చేసిన ఈ ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. ప్రయోగాల్లో భాగంగా మెదడులో చిప్ అమర్చిన ఓ కోతి ఎలా వ్యవహరిస్తుందో ఈ సమావేశంలో న్యూరాలింక్ ప్రదర్శించింది. కోతికి చిప్ అమర్చి, దాంతో వీడియో గేమ్ ఆడించారు. మెదడులో అమర్చిన చిప్ ద్వారా అది కంప్యూటర్ కు ఆదేశాలు ఇవ్వగలుగుతోందని తెలిపారు. అయితే, ఎలాన్ మస్క్ కృతిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మానవులకన్నా తెలివైన ఈ సాంకేతిక ముందు ముందు మానవాళికి ముప్పుగా పరిణమిస్తుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.