ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ గురించి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మరింతగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ ట్విట్టర్ ఉద్యోగిని నెట్టింట అవహేళన చేస్తూ మాట్లాడి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ ఉద్యోగికి బహిరంగంగా క్షమాపణ చెప్పారు.
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఆయన ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత అవి మరింత ఎక్కువయ్యాయి. అవన్నీ పక్కన పెడితే ఎలన్ మస్క్ ట్విట్టర్ ఉద్యోగితో చేసిన ట్వీట్ వార్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ ఉద్యోగి విషయంలో మస్క్ ప్రవర్తనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వెంటనే తన తప్పు తెలుసుకున్న ఎలన్ మస్క్ అతనికి క్షమాపణ కూడా చెప్పాడు. అయితే అసలు వారి మధ్య ఏం జరిగింది? ఎందుకు ఎలన్ మస్క్ క్షమాపణ చెప్పాడు అనే పూర్తి సమాచారాన్ని చూద్దాం.
వ్యయ నియంత్రణలో భాగంగా ట్విట్టర్ ఎలన్ మస్క్ ఉద్యోగాలు తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల హల్లీ(హరాల్దుర్ థోర్లీప్సన్ అసలు పేరు) అనే అకౌంట్ తో ట్విట్టర్ లో మస్క్ ఒక రిక్వెస్ట్ వచ్చింది. అదేంటంటే.. అతని ఉద్యోగం ఉందా? లేదా? అనే విషయాలపై అతని స్పష్టత లేదు. అతను నరాల బలహీనత వ్యాధితో బాధపడుతున్నాడు. అతని యాక్సెస్ బ్లాక్ అయ్యి తొమ్మిది రోజులు అయిపోయింది. హెచ్ఆర్ నుంచి అతనికి ఎలాంటి విషయం తెలియలేదు. అలాంటి ఆరోగ్య సమస్య ఉందని తెలిసి కూడా అతడిని ఉద్యోగం నుంచి తొలగించడాన్ని నేరుగా ట్విట్టర్ లో ఎలన్ మస్క్ నే హాలీ ప్రశ్నించాడు. అందుకు ఎలన్ మస్క్ చాలా కఠువుగా ట్విట్టర్ కు హాలీ అవసరం ట్విట్టర్ కు లేదని చెప్పాడు.
I’m not going to lie, this is the most entertaining exit interview I’ve ever witnessed pic.twitter.com/6OfjuGNIiC
— Alex Cohen (@anothercohen) March 7, 2023
అంతేకాకుండా అతను టైప్ చేయడం కూడా కష్టమని చెప్పారు.. కానీ తుపాను వేగంతో ట్వీట్లు చేస్తున్నాడనే కూడా విమర్శించాడు. అయితే హాలీతో పనిచేసిన ఓ వ్యక్తి అతని పరిస్థితిని వివరించడంతో మస్క్ తన తప్పును గ్రహించాడు. వెంటనే హరాల్దుర్ కి వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ఆ విషయాన్ని నేరుగా ట్విట్టర్ లో వెల్లడించడమే కాకుండా.. అతని బహిరగంగా క్షమాపణ కూడా చెప్పాడు. అతని ఉద్యోగం ఎక్కడికీ పోదని.. అతను ట్విట్టర్ సంస్థలోనే కొనసాగుతాడని స్పష్టం చేశాడు. మరో కామెంట్లో ఏదైనా నేరుగా మాట్లాడితేనే విషయం క్లియర్ గా ఉంటుందని.. ట్విట్టర్ లో కమ్యూనికేట్ చేస్తే అస్పష్టంగా ఉంటుందనే విధంగా కామెంట్ చేశాడు.
Based on your comment, I just did a videocall with Halli to figure out what’s real vs what I was told. It’s a long story.
Better to talk to people than communicate via tweet.
— Elon Musk (@elonmusk) March 7, 2023